Bengal SSC Scam : 20 కోట్లు కాదు..120 కోట్ల స్కామ్ జ‌రిగింది.. పార్థ ఛటర్జీపై సంచ‌ల‌న దావా వేసిన ఈడీ

By team teluguFirst Published Jul 26, 2022, 1:57 PM IST
Highlights

మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ పై ఈడీ సంచలన దావా వేసింది. పలు స్కామ్స్ లో మంత్రి 20 కోట్ల అవినీతికి మాత్రమే పాల్పడలేదని, మొత్తంగా 120 కోట్లు అవినీతి జరిగిందని ఈడీ పేర్కొంది. 

బెంగాల్ ఉపాధ్యాయ నియామక స్కామ్‌లో ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ కూడా అవినీతిపై స్టేట్‌మెంట్ ఇచ్చి విమర్శలు గుప్పించగా.. దర్యాప్తు సంస్థ ఈడీ కూడా సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరపు న్యాయవాది కోర్టులో సంచలన వ్యాజ్యం చేశారు. స్కూల్ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి చాలా తీవ్రంగా ఉంద‌ని పేర్కొంది. మొత్తం 20 కోట్లు కాదని, 120 కోట్ల అవినీతి జరిగింద‌ని తెలిపారు. మరో రూ.100 కోట్లు రికవరీ చేయాల్సి ఉంద‌ని చెప్పారు. 

Gujarat hooch tragedy : గుజరాత్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మ‌ర‌ణం..

ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యప్రకాష్ వి రాజు.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ ఇంట్లో నుంచి పెద్ద సంఖ్యలో గ్రూప్ డీ కార్యకర్తల గుర్తింపు కార్డులు, ప్రాథమిక ఉపాధ్యాయుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పార్థ ఛటర్జీ గ్రూప్-డీ, ఎస్‌ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ అవినీతిలో మాత్రమే కాకుండా ప్రైమరీ టీచర్ రిక్రూట్‌మెంట్ అవినీతిలో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

మరోసారి ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

‘‘ స్కూల్ రిక్రూట్ మెంట్ లో మొత్తం 120 కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. ఇది కాకుండా మరో 100 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. పార్థ ఛటర్జీ ప్రైమెరీ టీచర్, ఎస్‌ఎస్‌సీలో రిక్రూట్‌మెంట్ అవినీతిలో చురుకుగా పాల్గొన్నారు ’’ అని ఆయన పేర్కొన్నారు. మంత్రి అర్పితా ముఖర్జీతో కలిసి భూమిని కొనుగోలు చేశారని ఈడీ పేర్కొంది. 

Maharashtra Political crisis: శివ‌సేన ఎవ‌రిది? ఠాక్రే పిటిషన్‌ను స్వీక‌రించిన సుప్రీం.. విచార‌ణ ఎప్పుడంటే..?

అర్పితా ముఖర్జీతో పార్థ ఛటర్జీకి స‌న్నిహిత సంబంధాలున్నాయ్ 
న‌టి అర్పితా ముఖర్జీతో పార్థ ఛటర్జీకి స‌న్నిహ‌త సంబంధాలు ఉన్నాయ‌ని కూడా ఈడీ కోర్టుకు తెలిపింది. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో డ‌బ్బు, న‌గ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెప్పింది.  మంత్రి ఇంట్లో అర్పితకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు లభించాయని తెలిపారు. సెర్చ్ ఆపరేషన్‌లో కూడా 2012 జనవరి 21 నాటి పత్రం దొరికిందని, అందులోనే వీరిద్దరూ కలిసి భూమి కొనుగోలు చేశార‌ని తెలుస్తోంద‌ని అన్నారు. వీరిద్ద‌రూ నిత్యం మొబైల్‌ ఫోన్లలో సంప్రదింపులు జరుపుకునేవార‌ని అన్నారు. ఇద్ద‌రు వ్యక్తులను ముఖాముఖిగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదించారు.

బాల్ థాక్రేవి కాదు.. మీ సొంత తండ్రుల ఫొటోల‌తో ఓట్లు అడ‌గండి.. రెబ‌ల్ నేత‌లు, బీజేపీపై ఉద్ధ‌వ్ థాక్రే ఫైర్

అయితే దీనికి పార్థ ఛట‌ర్జీ త‌రుఫు న్యాయ‌వాది స్పందిస్తూ.. తాను త‌న జూనియ‌ర్ ని పిలిచినంత మాత్రాన‌, ఆమెతో మాట్లాడినంత మాత్రాన అంతరంగిక సంబంధం ఉన్న‌ట్టు కాద‌ని అన్నారు. కాగా అర్పిత ఇంట్లో నుంచి ఈడీ 21 కోట్ల 90 లక్షల నగదును,76 లక్షల విలువైన ఆభరణాలు, పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పార్థతో, ఏ రాజ‌కీయ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపారు. 

click me!