పశ్చిమ బెంగాల్ వంటకాలు అసోంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గువహటి సహా అనేక అసోం పట్టణ ప్రాంతాల్లో బెంగాల్ వంటకాల సువాసనలు వస్తున్నాయి. అక్కడి అసామీలు కూడా వీటిని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు అక్కడ భిన్న వంటకాల సమ్మేళనంతో సరికొత్త రుచులను భోజన ప్రియులు ఆస్వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదిపైకి సూర్యుడు రాగానే అసోం రాజధాని గువహతిలో జీవం తొణికిసలాడుతుంది. ఒకప్పుడు అసోం సాంప్రదాయ రుచులకు కేరాఫ్‌గా ఉండిన గువహతి ఇప్పుడు బెంగాలీ వంటకాలకూ చోటు ఇచ్చి సరికొత్త సువాసనలకు నెలవుగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో వంటల సువాసనలు ఇప్పుడు అసోం పట్టణ ప్రాంతాలకూ వ్యాపించాయి. అక్కడి బెంగాలీ, బెంగాలీయేతరులనూ కట్టిపడేస్తున్నాయి.
అసోంకు బెంగాలీ వంటకాలు చేరడం అకాస్మాతుగా ఏమీ జరగలేదు. వలసలు, సాంస్కృతిక మార్పిడిల ద్వారా ఈ భోజన అలవాట్లూ వ్యాప్తి చెందాయి. బెంగాలీ నుంచి వలసలు అసోంలో ఉన్న ప్రత్యేకమైన సంస్కృతిని మరింత సుసంపన్నం చేసింది. ఈ రెండు సంస్కృతుల సమ్మేళనం ఒక సరికొత్త రుచులకు పుట్టుకనిచ్చింది.
హిల్సా ఫిష్ లేదా కింగ్ ఆఫ్ ఫిష్‌ను ప్రస్తావించకుండా బెంగాలీ వంటకాల గురించి మాట్లాడలేం. ఈ వంటకం అసోం భోజన ప్రియులను కట్టిపడేసింది. ఎంతో జాగ్రత్తగా వండే ఈ సిల్వరీ ఫిష్‌కు ఉన్న ప్రత్యేకమైన రుచి సాంస్కృతిక సరిహద్దులను దాటేలా చేస్తుంది.
అసోం మార్కెట్‌లో మరో బెంగాలీ వంటకం చితోల్ ముయితా లేదా చితాల్ ఫిష్ రో కూడా ఫేమస్ అయింది. విభిన్న మసాలాలు, దినుసులతో చేసే ఈ వంటకం అసోంలో తనకంటూ స్థానం కల్పించుకుంది. అసోంలోని బెంగాలీయేతరులూ ఈ వంటకాలను వండే ప్రయత్నాలు మనకు అనేకం కనిపిస్తాయి.
అసోంలో బెంగాలీ వంటకాల రంగప్రవేశంలో కోల్‌కతాలోని ఫుడ్ చైన్స్ రావడం ఒక కీలక పరిణామంగా ఉన్నది. 6, బల్లీగంజ్ ప్లేస్, కస్తూరి వంటి ఫేమస్ రెస్టారెంట్లు, ఈటరీలు అసోంకు వచ్చాయి. ఇవి బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకాయి క్యూసిన్, ఢాకాయి బిర్యానీ, భాపా ఐలిష్, సోర్షే ఐలిష్ వంటివి వాటి మెనూల్లో ఉంటాయి.
దుర్గా పూజ ఉత్సవాలు జరిగేప్పుడు అసోంలోని బెంగాలీలు వారి వంటకాలను, రుచులను ఆస్వాదిస్తూ.. అక్కడి వాతావరణమంతా బెంగాలీ రుచులను నింపేస్తారు. ఈ సమయంలో కేవలం ఫేమస్ ఫుడ్ చైన్స్ మాత్రమే కాకుండా స్థానికంగా ఎదిగిన గువహటితోని మా మనాషా, అజోయ్ హోటల్ వంటివీ భోజనప్రియులతో కిటకిటలాడుతాయి. ఆ వంటకలు బెంగాలీ, అసోమీల సంస్కృతుల మేళవింపులుగా కనిపిస్తాయి.
Also Read: ఇండియాలోని కుటుంబాన్ని కలిసిన పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా
కస్తూరి రెస్టారెంట్ గువహటికి వచ్చే వరకు ఢాకాయి బెంగాలీ క్యూసిన్ అక్కడకు రాలేదు. అసోంలో చాలా వరకు బెంగాలీ వంటకాలు పశ్చిమ బెంగాల్ వంటకాల ప్రేరణగానే కనిపిస్తాయి. కస్టూరి రెస్టారెంట్‌లో కొచ్చు పట్టా చింగ్రి భాపా, కాస్కి ఫిష్ చచోరీ, మోచా చింగ్రీ ఘోంటో, భేట్కి పాటూరి, బేట్కి భాపా, హిల్సా కర్రీ, మస్టర్డ్, భాపా హిల్సా, జంబో చితన్ పేటీ, పబ్దా బోరీ, బగన్ జల్, చితల్ ముతియా సహా అనేక ఇతర వంటకాలు కూడా మనకు కనిపిస్తాయి.
అసోమీలు ప్రతి రోజూ పశ్చిమ బెంగాల్ వంటకాలను ఆస్వాదించేలా ఈ మార్పు జరిగింది. భారత్ ప్రతీకగా నిలిచే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతున్నది. భిన్న సముదాయాలను వాటి సాంస్కృతిక పరిధులను దాటి కలిసిపోవడానికి ఆహారం ఎలా దోహదపడుతుందో ఈ పరిణామం వెల్లడిస్తున్నది.
గువహటి సహా ఇతర అసోం పట్టణ ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ వంటకాలను చూస్తే ఈ ఆహార ప్రయాణం ముగిసేది కాదని చెప్పవచ్చు. రోజులు గడుస్తున్నా కొద్దీ అసోంలో హిల్సా, చితోల్ ముతియా వంటి వంటకాలను ట్రై చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మీరు అసోంకు వెళ్లినప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్ వంటకాల గురించి లలితంగా మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోవద్దు. ఇది ఆహార పద్ధతుల పరిణామానికి నిదర్శనం.