వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు.. భార్య‌కు వీడియో కాల్‌‌.. ఉరి వేసుకుని బ్యాంకర్ ఆత్మహత్య

By Mahesh KFirst Published Jan 30, 2023, 3:10 PM IST
Highlights

వివాహేతర సంబంధం కారణంగా ఓ బ్యాంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఉంటున్న భార్యకు వీడియో కాల్ చేసి.. ఆన్ కాల్‌లో ఉండగానే భర్త పశ్చిమ బెంగాల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 

కోల్‌కతా: వివాహేతర సంబంధం వారి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. 47 ఏళ్ల భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య అహ్మదాబాద్‌లో ఉండగా.. భర్త వృత్తిరీత్యా బ్యాంకర్‌గా పశ్చిమ బెంగాల్‌లో చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన భార్యకు వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్‌‌ ఆన్‌లో ఉండగానే అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అపర్ణ బెనర్జీ, ప్రసూన్ బెనర్జీలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం ఉన్నది. వీళ్లు తల్లితోనే అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. ప్రసూన్ బెనర్జీ ఐడీబీఐ బ్యాంక్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మేనేజర్‌గా పని చేసేవాడు. గతంలో అహ్మదాబాద్‌లో చేసిన ప్రసూన్ బెనర్జీ ఆ తర్వాత కోల్‌కతాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అక్కడ షేక్స్‌పియర్ సరని బ్రాంచ్‌లో చేసేవాడు. 

పూర్వాంచల్ మెయిన్ రోడ్‌లో నివసిస్తున్న ప్రసూన్ బెనర్జీ ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యకు వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్ ఆన్‌లో ఉండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసి ఆమె వెంటనే ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. వారిలో ఒకరు కోల్‌కతా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు ఫోన్ చేసి విషయం వివరించారు.

ఈ విషయం తెలియగానే గర్ఫా పోలీసు స్టేషన్ నుంచి పోలీసుల బృందం ప్రసూన్ జోషి నివాసానికి వెళ్లి డోర్ కొట్టారు. కానీ, డోర్ లోపలి నుంచి లాక్ చేసుకుని ఉండటంతో బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. అక్కడ ప్రసూన్ బెనర్జీ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని ఎంఆర్ బంగూర్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఉదయం 5.35 గంటలకు హాస్పిటల్ చేరిన ప్రసూన్ జోషి అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. 

Also Read: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. మధ్యప్రదేశ్‌లో విషాదం

స్పాట్‌లో ప్రసూన్ జోషి వద్ద ఓ సూసైడ్ నోట్ లభించిందని పోలీసు శాఖ వర్గాలు వివరించాయి. ప్రసూన్ బెనర్జీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానిస్తున్నదని ఆ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. దీంతో అతడితో గొడవ పెట్టుకుందని, ప్రసూన్ బెనర్జీ పై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని వివరించారు.

కోల్‌కతాలోని గర్ఫా పోలీసు స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు పెట్టిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

click me!