భారత్ కు తన బాధ్యతలెంటో తెలుసు - చండీగఢ్‌ జీ 20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్

Published : Jan 30, 2023, 02:07 PM IST
భారత్ కు తన బాధ్యతలెంటో తెలుసు - చండీగఢ్‌ జీ 20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్

సారాంశం

భారత్ అధ్యక్షతన జీ 20 సమావేశాలు నిర్వహించడం పట్ల గర్వంగా భావించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. జీ-20 అధ్యక్షుడిగా భారతదేశానికి తన బాధ్యతలు తెలుసని తెలిపారు. 

భారత్ కు తన బాధ్యతలేంటో తెలుసు అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మన దేశంలో జీ 20 సదస్సులను నిర్వహించడంం సంతోషంగా ఉందని తెలిపారు. భారత అధ్యక్షతన తొలి రెండు రోజుల జీ 20 ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా తోమర్ ప్రసంగిస్తూ.. జీ 20 అధ్యక్షతన దేశంలో కార్యక్రమాలు నిర్వహించడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. భారతదేశం జీ20 కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో దేశంలోని 50కి పైగా ప్రదేశాలలో 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

దేశాన్ని విభజించే, విచ్ఛిన్నం చేసే రాజకీయం నడుస్తోంది.. నా సోదరుడిది ఆధ్యాత్మిక యాత్ర: ప్రియాంక గాంధీ

‘‘మన జీ20 ప్రెసిడెన్సీలో మన దేశంలో ఈవెంట్‌లను నిర్వహించడం గర్వంగా, సంతోషంగా భావించాలి. ఈ సందర్భంగా దేశంలోని 50 ప్రదేశాలలో 200 కి పైగా సమావేశాలు నిర్వహించబడతాయి. సుమారు 2 లక్షల మంది ప్రతినిధులు భారతదేశానికి వస్తారు’’ అని ఆయన అన్నారు.ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరికీ తోమర్ కృతజ్ఞతలు తెలిపారు.  ‘జీ-20 అధ్యక్షునిగా భారత్ కు తన బాధ్యతల గురించి బాగా తెలుసు. నేడు ప్రపంచం సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి లోతైన పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. సరిహద్దుల ద్వారా నిర్వచించబడవు. ఎదురవుతున్న సవాళ్లు ప్రపంచ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వాటికి ప్రపంచ పరిష్కారాలు అవసరం. అందుకే ప్రపంచ సమాజం సమన్వయ విధానంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో జీ20 దేశాలు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, ఐక్యతను పెంపొందించే మార్గాలు, 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధం కావాలో చర్చిస్తారని ఆర్థిక వ్యవహారాల విభాగం ఆర్థిక సలహాదారు అను పి మథాయ్ తెలిపారు. పేద, బలహీన దేశాలకు గరిష్ట మద్దతును అందించే మార్గాలను అన్వేషించడంపై కూడా ఈ సమావేశం దృష్టి పెడుతుందని ఆమె పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ కో-చైర్మన్లుగా ఉన్న ఫ్రాన్స్, కొరియా సంయుక్తంగా చర్చలు జరుపుతాయి. సోమవారం ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ (సీబీడీసీలు) : అవకాశాలు, సవాళ్లు’ అనే పేరుతో జీ20 సైడ్ ఈవెంట్ జరగనుంది. దేశాల అనుభవాలను పంచుకోవడం, సీబీడీసీల స్థూల ప్రభావాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !