వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరం సిద్ధం: అమిత్ షా కీలక ప్రకటన

By Mahesh KFirst Published Jan 5, 2023, 8:04 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయోధ్య రామ మందిరం 2024 జనవరి 1వ తేదీనాటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. త్రిపురలో ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు. అదే సందర్భంలో రామ మందరిం గురించి మాట్లాడారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రిపురలో కీలక ప్రకటన చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని వెల్లడించారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్నో ఆటంకాలు తలపెట్టిందని, కోర్టుల్లో మందిరానికి ఆటంకంగా నిలిచిందని ఆరోపణలు చేశారు.

‘కోర్టుల్లో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్నో అడ్డంకులు సృష్టించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాతే ఒక రోజు సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు మీరంతా జాగ్రత్తగా వినండి. 2024 జనవరి 1వ తేదీన రామ మందిర ఆలయం సిద్దం అవుతుంది’ అని అమిత్ షా తెలిపారు.

నరేంద్ర మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉన్నదని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ప్రజలు అచంచల ప్రేమ చూపిస్తున్నారు. త్రిపురలో బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ ప్రేమనే తెలియజేస్తున్నదని అన్నారు.

Also Read: ‘యూపీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా?’ రాహుల్ యాత్రకు రామ మందిర ప్రధాన అర్చకుడు, సెక్రెటరీ మద్దతుపై జైరాం రమేశ్

త్రిపురలో మూడింట రెండు వంతుల మెజార్టీతో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మకం తనకు ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఓటేయాలని, కమలం పుష్పానికి అనుకూలంగా ఓటేయాలని కోరారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తెద్దాం అని తాను నినాదాన్ని ఇచ్చా అని అమిత్ షా గుర్తు చేశారు. కమ్యూనిస్టుల దుష్ట పాలనకు చరమ గీతం పాడాలనే ఆ నినాదం ఇచ్చా అని వివరించారు.

click me!