శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం: ఫస్ట్ ఫేజ్ పూర్తి, దర్శనం అప్పటి నుంచే..!!

By Siva KodatiFirst Published Oct 15, 2021, 5:09 PM IST
Highlights

శ్రీరాముడి జన్మభూమి (ram janmabhoomi ) అయోధ్యలో రామమందిర నిర్మాణం (ayodhya ram mandir) శరవేగంగా కొనసాగుతోంది. 2.77 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో, 161 అడుగుల ఎత్తులో భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఫౌండేషన్ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి.

శ్రీరాముడి జన్మభూమి (ram janmabhoomi ) అయోధ్యలో రామమందిర నిర్మాణం (ayodhya ram mandir) శరవేగంగా కొనసాగుతోంది. 2.77 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో, 161 అడుగుల ఎత్తులో భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఫౌండేషన్ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబర్ మధ్య నాటికి సెకండ్ ఫేజ్ పనులు పూర్తి కానున్నాయి. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్ 2023 నాటికి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర (sri ram janmabhoomi teerth kshetra) తెలియజేసింది.

కాగా, రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ (shri ram janmabhoomi teerth trust) తొలిసారిగా రామ మందిర నిర్మాణ పనులను చూపించడానికి మీడియాకు గత నెల 16న అనుమతినిచ్చింది. ముందుగా ప్రకటించుకున్న డెడ్‌లైన్ 2023 డిసెంబర్‌కల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని ఈ ట్రస్టు సభ్యులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భక్తులు మందిరంలోకి వెళ్లడానికి సర్వం సిద్ధం చేయనున్నారు.

ALso Read:రామమందిర విరాళాలు.. 15 వేల చెక్కులు బౌన్స్.. !!

ఆలయ నిర్మాణం కోసం గట్టి భూమి తగిలే వరకు సుమారు 40 అడుగులు తవ్వి తీశామని, దాన్ని 47 వరుసలు కాంక్రీట్‌తో నింపామని ఎల్ అండ్ టీకి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ వివరించారు. ఒక్కో కాంక్రీట్ లేయర్ ఒక అడుగు మందం ఉన్నదని తెలిపారు. ఇక్కడి పది ఎకరాల భూమిలో మూడు అంతస్తుల రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) గతేడాది ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ మందిర నిర్మాణం కోసం నాలుగు లక్షల ఘనపు అడుగుల మార్బుల్, రాతిని రాజస్తాన్ నుంచి తెచ్చి వినియోగించనున్నారు. ఈ ఆలయం గర్భగుడిపై 161 అడుగుల ఎత్తు ఉండనుంది.
 

click me!