ఆటో డ్రైవర్ నుంచి డిన్నర్ ఇన్విటేషన్.. వెంటనే అంగీకరించిన సీఎం..

By telugu teamFirst Published Nov 22, 2021, 8:26 PM IST
Highlights

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ రోజు రాత్రి ఓ ఆటో డ్రైవర్ భోజనానికి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి క్షణాల్లోనే కేజ్రీవాల్ అంగీకరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  లూధియానాలో ఆటో, క్యాబ్ డ్రైవర్‌లో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ కేజ్రీవాల్‌ను భోజనానికి ఆహ్వానించారు.

చండీగడ్: Punjab అసెంబ్లీ Elections కోసం ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. AAP అధినేత Arvind Kejriwal తరుచూ పంజాబ్ పర్యటించి ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగానే లూధియానాలో ఈ రోజు Auto Driverలు, క్యాబ్ డ్రైవర్లతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ‘మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి’ అంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిక్లేర్ చేశారు. వెంటనే ఆ డ్రైవర్‌ల నుంచి ఒకరు లేచి మైక్ తీసుకున్నారు. ‘ఈ రోజు రాత్రి ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనం చేయడానికి వస్తారా?’ అని అడిగారు. వెంటనే హాల్ అంతా చప్పట్లు, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఈ Dinner Invitationకు అరవింద్ కేజ్రీవాల్ వెంటనే సమాధానమిచ్చారు. ఈ రోజేనా? అంటూ అడిగాడు. ఔనని సమాధనం రాగానే ‘ఓకే.. వస్తాను’ అంటూ చెప్పాడు. దీంతో హాల్‌లో గోల రెట్టింపు అయింది.

లూధియానాలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల‌తో సమావేశం కాబోతున్న హాల్ అంతా సిద్ధమైంది. అక్కడికి చేరుకుని డ్రైవర్‌లతో అరవింద్ కేజ్రీవాల్ సరదాగా మాట్లాడారు. అనంతరం పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హాల్ అంతా డ్రైవర్‌లతో కిక్కిరిసి పోయి ఉన్నది. ఆప్ నేతలు స్టేజీపై ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ నిర్వహించారు. ఇందులో డ్రైవర్లు అడిగిన పలు ప్రశ్నలకు అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ఇంతలో డ్రైవర్‌ల వైపు నుంచి ఓ వ్యక్తి మైక్ అందుకుని ‘నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను సార్. నేను ఓ ఆటోవాలాను’ అని పరిచేయం  చేసుకున్నారు. అనంతరం ‘సార్, మీరు ఆటో డ్రైవర్లకు సహాయం చేస్తారు. సార్, మీరు ఈ పేద ఆటోవాలా ఇంటికి వచ్చి భోజనం చేస్తారా? ఇది నేను మీకు హృదయపూర్వకంగా చేస్తున్న ఆహ్వానం’ అని అన్నారు. అంతే ఆ హాల్ అంతా గొల్లుమన్నది. కొందరు వెళ్లాలి వెళ్లాలి అంటూ బిగ్గరగా అరుపులు వేశారు.

Also Read: నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు నొప్పేంటి?.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

దీనికి సమాధానంగా నవ్వుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘ఓ.. ఎందుకు రాను. ఈ రోజు రాత్రేనా?’ అంటూ అడిగాడు. ఈ ప్రశ్నకు హాల్‌లోని గోల రెట్టింపు అయింది. అందుకు ‘ఔను. ఈ రోజే సార్’ అని ఆ ఆటోవాలా సమాధానం ఇచ్చారు. నిజానికి ఆయన ఓ రాజకీయ నేతనే కాదు, ఒక హై ప్రొఫైల్ గెస్టును డిన్నర్ ఇన్వైట్ చేశారు. ఢిల్లీ సీఎం. ముందస్తుగా సమయమూ ఇవ్వకుండానే ఇన్విటేషన్ ఇచ్చాడు.

దీనికి మరోసారి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘నేను భగవంత్, హర్‌పాల్ సింగ్‌ను కూడా నాతోపాటు తీసుకురావచ్చునా? మేము అంతా వస్తాం. సరేనా?’ అంటూ అడిగాడు. దీనికి ఆ ఆటో డ్రైవర్ సరేనని అని అన్నాడు. దీంతో హాల్ అంతా ఒక్కసారిగా ‘కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ నినాదాలు ఊపందుకున్నాయి.

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆటో డ్రైవర్‌లను కీలకంగా చూస్తారు. ఢిల్లీలోనూ ఆయన ఆటో డ్రైవర్‌లతో ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేశారు. తాను వారికి ఒక సోదరుడి వంటి వారని, దేనికోసమైనా తన దగ్గరకు రావచ్చు అని, ఒక వేళ ఆటో నడవక ఆగిపోయినా తన దగ్గరకు రావచ్చు అని చెప్పేవారు.

ఈ కార్యక్రమాని కంటే ముందు పంజాబ్‌లో నిర్వహించిన ప్రచారంలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై విమర్శలు చేశారు. చన్నీ ఒక ఫేక్ కేజ్రీవాల్ అని అన్నారు. ఢిల్లీలో తాను ప్రారంభించే పథకాలను ఆయన పంజాబ్‌లో మొదలు పెడుతుంటారని విమర్శించారు. తాను మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించగానే ఆయన కూడా పంజాబ్‌లో ప్రకటించాడని, కానీ, ఒక్కటి కూడా తెరువలేదని అన్నారు. ఆటో యూనియన్లతో సమావేశం అవుతానని 10 రోజుల కిందే తాను ప్లాన్ చేసుకున్నాడని, ఇవాళ ఆయన కూడా డ్రైవర్‌లతో భేటీ  అవుతున్నారని ఆరోపించారు.

click me!