
రాయ్‌పూర్: Chhattisgarh ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య పౌరుల ఆర్థిక భారాన్ని తగ్గించేలా చమురు(Fuel) ధరల(Price)పై వ్యాట్(VAT) తగ్గించనున్నట్టు ప్రకటించింది. Petro;పై ఒక శాతం, Dieselపై రెండు శాతం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం భుపేశ్ భగేల్ సారథ్యంలోని ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలోనే పెట్రోల్‌పై ఒక శాతం, డీజిల్ పై రెండు శాతం వ్యాట్ తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ. 1000 కోట్ల నష్టం కలుగుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుందని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సీఎం భుపేశ్ భగేల్ సారథ్యంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పెట్రోల్‌పై ఒక శాతం, డీజిల్‌పై రెండు శాతం వ్యాట్ తగ్గించినట్టు ఆ ప్రకటన పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల భారం పడనున్నట్టు వివరించింది.
Also Read: మీ ప్రభుత్వాలను అడగండి: పెట్రోల్, డీజిల్ రేట్లపై నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పౌరులకు చమురు ధర తగ్గింపు రూపంలో కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వరుసగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటించాయి. ఆ తర్వాత ఇతర పార్టీలు అధికారంలోని రాష్ట్రాలూ ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. తాజాగా, చత్తీస్‌గడ్ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయమే తీసుకుంది.
చత్తీస్‌గడ్ మంత్రి టీఎస్ సింగ్ డియో ఇదే అంశంపై శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఊరట ఇచ్చేలా చమురు ధరలను తగ్గించడానికి వ్యాట్ తగ్గింపు చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని తనను కోరినట్టు ఆయన వివరించారు. గతంలోనూ చమురు ధరల తగ్గింపుపై సీఎం భుపేశ్ భగేల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే చమురు ధరలను రూ. 60కి కూడా తగ్గించవచ్చు అని అన్నారు.
Also Read: ఇంధన ధరలపై వ్యాట్ తగ్గింపునకు తెలుగు రాష్ట్రాలు వెనక్కి: కారణం ఇదీ...
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ నేతలు చమురు ధరల తగ్గింపుపై డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వ అధినేతలను వీలైనప్పుడుల్లా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చత్తీస్‌గడ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.