కత్తులతో దాడికి ప్రయత్నించారు.. అదనపు భద్రత ఇవ్వండి - లక్నో పోలీస్ కమిషనర్ కు స్వామి ప్రసాద్ మౌర్య లేఖ

Published : Feb 16, 2023, 09:48 AM IST
కత్తులతో దాడికి ప్రయత్నించారు.. అదనపు భద్రత ఇవ్వండి - లక్నో పోలీస్ కమిషనర్ కు స్వామి ప్రసాద్ మౌర్య లేఖ

సారాంశం

రామచరితమానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సంచలన ఆరోపణలు చేశారు. తనపై పలువురు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, తనకు అదనపు భద్రత కావాలని లక్నో పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. 

తపస్వీ చావ్నీ ఆలయానికి చెందిన మహంత్ రాజు దాస్, మహంత్ పరమహంస్ దాస్ మద్దతుదారులు తనపై కత్తులు, 'ఫార్సా'లతో దాడికి ప్రయత్నించారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన లక్నో పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. రామచరితమానస్‌లోని కొన్ని చౌపాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.

నేను డబుల్ మైండ్ తో ఉన్నాను.. అందుకే నిక్కీని చంపాను.. పోలీసుల విచారణలో సాహిల్..

లక్నోలోని తాజ్ హోటల్‌లో టీవీ చానెల్ సమావేశానికి హాజరై, తిరిగి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన తన లిఖిత పూర్వక ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ దాడిని నిందిస్తూ హోటల్ భద్రతపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. తనకు అదనపు భద్రత కావాలని కోరారు. రామచరితమానస్ వ్యాఖ్యల నేపథ్యంలో తన తల నరికిన వారికి ఓ దర్శకుడు రూ.21 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారని ఆయన గతంలో ఆరోపించారు.

‘‘ఈ రోజు 15.02.2023 మధ్యాహ్నం 12.30 గంటలకు లక్నోలో నన్ను అతిథిగా ఆహ్వానించారు. మహంత్ రాజు దాస్, హనుమాన్ గఢీ, అయోధ్య, మహంత్ పరమహంస్ దాస్, తపస్వి, చావ్నీ మందిర్, వారి సహచరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే సమయంలో నాపై కత్తి, ఫార్సాతో దాడికి ప్రయత్నించారు’’ అని మౌర్య పోలీసు కమిషనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: మరోసారి బీజేపీ ప్ర‌భుత్వమే.. : ఎన్నికల్లో గెలుపుపై మాణిక్ సాహా ధీమా

తనపై ప్రకటించిన బహుమానాన్ని కూడా ఎస్పీ నేత వివరించారు. టెలివిజన్ కార్యక్రమానికి వారిని (సాధువులను) ఆహ్వానించడం కూడా వ్యూహంలో భాగమే అని అన్నారు. ‘‘మద్దతుదారుల జోక్యంతో నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. గతంలో నన్ను చంపేందుకు రూ.21 లక్షలు కూడా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకుని వారిని నిర్ణీత సమయానికి ముందే పిలిపించి ఆయుధాలతో కూర్చోబెట్టడం కూడా ప్రణాళికాబద్ధమైన వ్యూహమే.’’ అని పేర్కొన్నారు. 

కాగా.. ఫిబ్రవరి 1న మౌర్య మాట్లాడుతూ రామచరిత మానస్ వ్యాఖ్యలపై తన తల నరికి రూ.21 లక్షల రివార్డు ప్రకటించిన సాధువు తన ఫోటోను కత్తితో కత్తిరించారని, ఆయన దెయ్యం అని అభివర్ణించారు. ‘‘నా తల నరికిన వారికి రూ.21 లక్షలు ఇస్తామని ప్రకటించిన అహంకారి, కపటబుద్ధి, మారువేషంలో ఉన్న బాబాలు, అదే బాబా కత్తితో ఫోటో కట్ చేసి తాను దెయ్యం అని నిరూపించుకున్నాడు.’’ అని ఆయన ట్వీట్ చేశాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే పదాలు ఉన్నాయని మౌర్య పేర్కొన్నారు.

ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. 2032 నాటికి టీఈడీబీఎఫ్ విమానాల ఉత్పత్తి : నేవీ చీఫ్

అంతకు రెండు రోజుల ముందు మౌర్య ఈ విషయంలో స్పందిస్తూ.. మహంత్ రాజు దాస్‌ను చంపడానికి రూ. 21 లక్షలు ఖర్చు పెట్టే బదులు శపిస్తే సరిపోయేదని అన్నారు. దీని వల్ల రూ.21 లక్షలు ఆదా చేయవచ్చని చెప్పారు. జనవరి 28వ తేదీన కూడా ఆయన మాట్లాడుతూ.. మతం పేరుతో గిరిజనులు, దళితులు-వెనుకబడినవారు, మహిళలను కించపరిచే కుట్రను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానని మౌర్య స్పష్టం చేశారు. ‘‘ కుక్కలు మొరగడం వల్ల ఏనుగు తన నడకను మార్చుకోదు. అలాగే వారికి తగిన గౌరవం ఇచ్చే వరకు నేను నా మాట మార్చుకోను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?