
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు జోడో యాత్ర తో దేశ మంతా పాదయాత్ర చేసిన ఆయన ప్రస్తుతం వెకేషన్ కి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన వ్యక్తిగత పర్యటన కోసం.. జమ్మూకశ్మీర్ లోని గుల్ మార్గ్ వెళ్లారు. అక్కడ ఆయన మంచులో సర్ఫింగ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
"విజయవంతమైన భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ విహారయాత్ర ఎంజాయ్ చేస్తున్నారు’’ అంటూ వీడియోకి క్యాప్షన్ పెట్టారు. వీడియోలో రాహుల్ చాలా చక్కగా సర్ఫింగ్ చేస్తూ కనిపించారు.
ఉత్తర కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ గుల్‌మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌కు వెళుతుండగా తంగ్‌మార్గ్ పట్టణంలో కొద్దిసేపు ఆగినప్పుడు ఆయన ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ సమయంలో ఆయనను మీడియా చుట్టుముట్టి... కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా.. ఆయన సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు. కేవలం నమస్కారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.... అక్కడకు వచ్చిన కొందరు పర్యాటకులతో మాత్రం ఆయన సరదాగా సెల్ఫీలు దిగారు.
గాంధీ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని, లోయలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు తెలిపాయి.
గత నెలలో, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 3,970 కి.మీ. యాత్రలో ఆయన 100కి పైగా కార్నర్ మీటింగ్‌లు, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.