
కోర్టు కేసులో సెటిల్ మెంట్ కు అంగీకరించనందుకు ఓ మహిళపై పలువురు దుండుగులు దాడి చేశారు. ఆమె బట్టలను చింపేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు, ‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. యూపీలోని పిలిభిత్ లోని న్యూరియా ప్రాంతానికి చెందిన మహిళ గతంలో ఓ విషయంలో పలువురిపై కేసు పెట్టింది. ఆ వివాదంపై ఇప్పుడు కోర్టులో ఉంది. అయితే ఆమె ప్రత్యర్థులు కేసును వెనక్కి తీసుకోవాలని, సెటిల్ మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనికి ఆ మహిళ అంగకరించడం లేదు.
బ్యూటీ పార్లర్ లో యువతికి చేదు అనుభవం.. నూనె పెట్టగానే రాలిపోయిన మొత్తం జుట్టు.. అబిడ్స్‌లో ఘటన
ఈ క్రమంలోనే జూలై 31వ తేదీన కూడా ఆ మహిళ దగ్గరకు ప్రత్యర్థులు వచ్చారు. ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. కేసు సెటిల్ మెంట్ చేసుకోవాలని ఆమెను బెదిరించారు. కానీ వారి మాట మహిళ వినలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన దుండుగులు ఆమెను చితకబాదారు. ఆ మహిళ దుస్తులు కూడా చింపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేడు జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు.. ఎక్కడంటే ?
ఈ ఘటనపై బాధితురాలు బుధవారం పిలిభిత్ జిల్లా ఎస్పీ అతుల్ శర్మను ఆశ్రయించింది. నిందితులను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. అలా చేయకపోతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మహిళ ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.