ఢిల్లీలో దారుణం.. చెక్క పెట్టెలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితి మృతి

Published : Jun 07, 2023, 11:46 AM ISTUpdated : Jun 07, 2023, 11:47 AM IST
ఢిల్లీలో దారుణం.. చెక్క పెట్టెలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితి మృతి

సారాంశం

ఢిల్లీలోని జామియా నగర్ లోని ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు అనుమానస్పదస్థితిలో చనిపోయారు. వారిద్దరి మృతదేహాలు ఓ చెక్క బాక్సులో కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన కొన్ని గంటల తర్వాత ఓ చెక్క పెట్టెలో అనుమానస్పదంగా చనిపోయి కనిపించారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ఓ ఇంట్లో వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చనిపోయాడని భావించి మృతదేహాల గదికి.. కాపాడిన తండ్రి.. ఒడిశా ప్రమాదంలో వెలుగులోకి మరో ధీన గాథ

ఢిల్లీలోని జామియా నగర్ లో జోగా బాయి ఎక్స్ టెన్షన్ లోని ఎఫ్ 2 అనే ఇంట్లో 8 ఏళ్ల నీరజ్, 6 ఏళ్ల ఆర్తి అనే చిన్నారులు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. సోమవారం వీరిద్దరూ తన తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు భోజనం చేశారు. అయితే 3.30 గంటల నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు.

ముస్లింతో లేచిపోయిన యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించి మనసు మార్చిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ట్విస్ట్ ఏంటంటే ?

దీంతో తల్లిదండ్రులు, ఇతర పిల్లలు కలిసి సమీపంలోని వీధులు, ఇళ్లలో వెతకడం ప్రారంభించారు. అనంతరం ఇంట్లో ఉన్న ఓ చెక్క బాక్సుని తీసి చూడగా.. అందులో చిన్నారులిద్దరూ శవమై కనిపించారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొరి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ప్రమాదవశాత్తూ ఊపిరాడక మృతి చెందినట్లు క్రైమ్ టీం నిర్ధారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ప్రేయసి మాట్లాడటం లేదని.. ట్రైన్ సిగ్నల్ ధ్వంసం చేసిన యువకుడు

ఢిల్లీ పోలీసులు చిన్నారుల మృతదేహాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu