దారుణం : దొంగతనం చేస్తుండగా చూసిందని.. 9 ఏళ్ల బాలికను హత్య చేసిన పక్కింటి బాలుడు...

By SumaBala BukkaFirst Published Jun 7, 2023, 11:37 AM IST
Highlights

దొంగతనం చేస్తుండగా చూసిందని ఓ 9యేళ్ల బాలికను చంపి.. వారింట్లోనే మూటగట్టి దాచిపెట్టాడు పక్కింటి కుర్రాడు. ఈ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. 

ఆగ్రా : ఆగ్రాలో తొమ్మిదేళ్ల బాలిక తప్పిపోయింది. ఆమె గురించి వెతుకుతున్న క్రమంలో కొన్ని గంటల తర్వాత, ఆమె మృతదేహాం వారి ఇంట్లోనే దొరికింది. ఈ ఘటన సోమవారం జరిగింది. సోమవారం రాత్రి ఆమె ఇంటిలోని స్టోర్‌రూమ్‌లోని అల్మారాలో మెత్తని బొంతలో చుట్టి, దాచి ఉంచడం కనుగొన్నారు పోలీసులు. బాలిక అదృశ్యం విషయంలో 19 ఏళ్ల యువకుడిని విచారించిన పోలీసులు ఈ భయంకరమైన విషయాన్ని కనిపెట్టారు. 

డీసీపీ వికాస్‌కుమార్‌ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘తన ఇంట్లో డబ్బు దొంగిలిస్తుండగా చిన్నారి చూసిందని..  నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆమె అందరికీ చెబుతుందని బాలికను గొంతుకోసి హత్య చేశానని, ఆ తరవాత ఆమెను ఇంట్లోనే దాచిపెట్టానని నేరం అంగీకరించినట్లుగా పోలీసులు  తెలిపారు.

ప్రభుత్వ హాస్టల్‌లో 18 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు రైలు ట్రాక్ పై పడి ఆత్మహత్య...

బాధితురాలి కుటుంబం, నిందితుడి కుటుంబం ఆగ్రా జిల్లా జగదీష్‌పురా పోలీసు పరిధిలోని ఒక ప్రాంతంలో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలిక కనిపించకుండా పోయిందని కుటుంబసభ్యలు వెతుకుతుంటే.. నిందితుడు కూడా వారితో పాటు కలిసి వెతికినట్టు నటించాడు. 

బాధితురాలి కుటుంబం పోలీసులకు కూతురి అదృశ్యం మీద ఫిర్యాదు చేయగా.. వారి విచారణలో ఈ భయంకర నిజం వెలుగు చూసింది. దీంతో బాలిక తండ్రి నిందితుడి మీద కేసు పెట్టాడు. ఈ కేసు ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు సన్నీపై ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్), 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం కావడం), 397 (దోపిడీ లేదా దొంగతనం, మరణం లేదా బాధాకరమైన బాధ కలిగించే ప్రయత్నంతో), 411 (నిజాయితీ లేకుండా దొంగిలించబడిన ఆస్తిని స్వీకరించడం) కేసులు పెట్టారు.

చోరీకి గురైన రూ.20,000 సన్నీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నేరం జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం బయట ఉన్నారు.
పనికి వెళ్లేప్పుడు వారు పిల్లలను ఒంటరిగా వదిలివేసేవారు, నిందితుడి కుటుంబాన్ని, ఇతర ఇరుగుపొరుగు వారిని చూసుకోమని చెప్పేవారు. 

click me!