కర్ణాటకలోని ఉడిపిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను ఓ దుండుగుడు దారుణంగా హతమార్చాడు. నిందితుడిని ఎయిర్ ఇండియాలో పని చేసే ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటకలోని ఉడిపిలో దారుణం జరిగింది. నేజర్ సమీపంలోని త్రిపాఠి నగరాలో ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హత్యకు గురైన వారిలో 48 ఏళ్ల హసీనా ఆమె పిల్లలు అఫ్సాన్ (23), అసీమ్ (12), ఐనాజ్ (21)లు ఉన్నారు.
Kulgam encounter: కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..
undefined
కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగి ప్రవీణ్ అరుణ్ చౌగులేను అరెస్టు చేశారు. అతడే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఐనాజ్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ యాజమాన్యం తమ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు తనను బాధించిందని ఐనాజ్ తండ్రి మహ్మద్ నూర్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ ఘటన చోటు చేసుకున్న తరువాత ఎయిర్ ఇండియా అధికారులకు తమకు ఫోన్ చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం కూడా చేయలేదు. ‘‘ అసలు ఎలాంటి ఉద్యోగిని (ప్రవీణ్ అరుణ్ చౌగులే) రిక్రూట్ చేసుకుంటారు? ప్రవీణ్ చౌగులేను రిక్రూట్ చేసుకునే ముందు అతడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారా? అతను కంపెనీలో సీనియర్ క్రూ మెంబర్ కాబట్టి విమానంలో ప్రయాణీకులకు ఎలాంటి భద్రత ఉండేది’’ అని మహమ్మద్ నూర్ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఉడిపి జిల్లా ఇన్ చార్జి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ శుక్రవారం బాధితురాలి ఇంటికి వెళ్లారు. బాధిత కుటుంబీకులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట రీత్యా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.