అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు

By Asianet NewsFirst Published Apr 19, 2023, 1:29 PM IST
Highlights

అతిక్, అష్రఫ్ హత్య కేసులో ముగ్గురు షూటర్లకు కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. ఈ ముగ్గురిని భారీ పోలీసు బందోబస్తు మధ్య బుధవారం ఉదయం ప్రయాగ్ రాజ్ కోర్టుకు తీసుకురాగా..కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

అతిక్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను ప్రయాగ్ రాజ్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. హమీర్ పూర్ కు చెందిన మోహిత్ అలియాస్ సన్నీ (23), బందాకు చెందిన లావ్లేష్ తివారీ (22), కాస్ గంజ్ కు చెందిన అరుణ్ మౌర్య (18)లను ప్రతాప్ గఢ్ జైలు నుంచి ఈ ఉదయం ప్రయాగ్ రాజ్ కు తీసుకువచ్చి విచారణ నిమిత్తం భారీ పోలీసు బందోబస్తు మధ్య చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

విచిత్రం..చనిపోయాడని చెప్పిన డాక్టర్లు..పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమవుతుండగా మార్చురీలో కాళ్లు ఊపుతూ, సజీవంగా

60 ఏళ్ల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ లను శనివారం రాత్రి పోలీసు సిబ్బంది పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా జర్నలిస్టుల వేషంలో వచ్చిన దుండగులు వారిని కాల్చి చంపారు. పోలీసు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపబడిన అతిక్ కుమారుడు అసద్ ను ప్రయాగ్ రాజ్ లోని చాకియా ప్రాంతంలోని అతడి పూర్వీకుల కసరి మసారీ శ్మశానవాటికలో ఖననం చేసిన కొన్ని గంటల్లోనే మాఫియా సోదరులిద్దరూ హత్యకు గురయ్యారు.

ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టుల దాడి.. ఆకస్మిక కాల్పులు.. ఎక్కడంటే ?

మాఫియా సోదరులపై దుండగులు కాల్పులు జరిపిన సమయంలో షూటర్లలో ఒకరైన లవలేష్ తివారీకి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత ముగ్గురు దుండగులపై ఐపీసీ సెక్షన్ 302 (హత్యకు శిక్ష), 307 (హత్యాయత్నం), ఆయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారిలో ఒకరి వద్ద టర్కిష్ తుపాకుల తయారీ సంస్థ జియాగానా తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ పిస్టల్, జియాగానా ఉన్నాయి. అయితే వీటిని భారత్ లో నిషేధించారని నివేదికలు చెబతున్నాయని ‘ఏబీపీ లైవ్’ పేర్కొంది.

అతిక్ అహ్మద్ హత్య.. యూపీ డీజీపీ, ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

కాగా.. అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ను ఉమేష్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం ప్రయాగ్ రాజ్ కు తీసుకువచ్చారు. ఇప్పటికే ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అతిక్ నిందితుడిగా ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయాగ్ రాజ్ లోని ధూమన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసం వెలుపల తన భద్రతా సిబ్బందితో కలిసి కాల్చి చంపారు. 
 

click me!