నా వెనుకే వచ్చాడు.. అయినా పోలీసులు అడ్డుకోలేదు, పక్కా ప్లాన్‌తోనే దాడి : హిమంత బిశ్వ శర్మ

By Siva KodatiFirst Published Sep 10, 2022, 9:22 PM IST
Highlights

పక్కా ప్రణాళికతోనే హైదరాబాద్‌లో తనపై దాడికి యత్నించారని ఆరోపించారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఒకసారి అనుమతి ఇచ్చాక ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే తనపై దాడికి యత్నించారని సీఎం అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకుందామని అనుకున్నారని.. తాను మాట్లాడకముందే వేదికపైకి టీఆర్ఎస్ నాయకుడు వచ్చాడని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అంత దగ్గరలో పోలీసులు లేరని.. పదునైన ఆయుధంతో దాడి చేసే అవకాశం వున్నంత దగ్గరగా వచ్చాడని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ వుంటాయని.. అతను ఓ రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి, అతడు నన్నేమీ తిట్టలేదన్నారు. ఒకసారి అనుమతి ఇచ్చాక ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఈ ఘటనపై నేనేమీ కేంద్రానికి కంప్లైంట్ చేయడం లేదన్నారు. 

అంతకుముందు హైద్రాబాద్ లో శుక్రవారం జరిగిన వినాయక విగ్రహల నిమజ్జనం కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి బిశ్వశర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పై విమర్శలను టీఆర్ఎస్ నేత బిలాల్ సహించలేకపోయారు. ఈ వెంటనే బిశ్వశర్మ ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

ALso Read:హైద్రాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత: అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

ఈ సమయంలో సీఎం భద్రతా సిబ్బంది అతనిని నిలువరించారు. దీంతో బీజేపీ నేతలకు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య  వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ ను  పోలీసులు ఎంజె మార్కెట్  నుండి తీసుకొని వెళ్లిపోయారు. వేదికపైకి ఎవరు వస్తున్నారో పట్టించుకోకపోతే ఎలా అని అసోం సీఎం భద్రతా సిబ్బంది హైద్రాబాద్ పోలీసులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 

click me!