మానసిక వ్యాధితో బాధపడుతున్న ఏఎస్ఐ గోపాల్‌క్రుష్ణ దాస్.. అయినా సర్వీస్ రివాల్వర్ జారీ

By team teluguFirst Published Jan 30, 2023, 10:25 AM IST
Highlights

ఒడిశా ఆరోగ్య మంత్రిని కాల్చి చంపిన నబా కిషోర్ దాస్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తాాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ల కిందట ఆయన ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మందులు వాడుతున్నాడో లేదో స్పష్టంగా తెలియరాలేదు. 

ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్‌ను గన్ తో కాల్చి చంపిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్‌ఐ) గోపాల్‌కృష్ణ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన  బైపోలార్ డిజార్డర్‌కు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నట్లు ఇప్పుడు తెలిసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన చాలా కాలం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నా కూడా అధికారులు సర్వీస్ రివాల్వర్ జారీ చేశారు. పైగా బ్రజరాజ్‌నగర్‌లోని ఓ పోలీసు పోస్టుకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

బీఆర్ఎస్ సభకు ఆహ్వానం అందింది, కానీ రావడం లేదు.. కేసీఆర్ కోరిక మేరకు వారు వస్తారు.. బీహార్ సీఎం నితీశ్ కుమార్

గోపాలకృష్ణ దాస్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని బెర్హంపూర్ ఎమ్‌కేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సైకియాట్రీ విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖర్ త్రిపాఠి తెలిపారు. ఆయన ఎనిమిది నుండి పదేళ్ల కిందట తన క్లినిక్ కు మొదటి సారిగా వచ్చాడని తెలిపారు. ఏఎస్ఐ త్వరగా కోపం తెచ్చుకునేవారని, దాని కోసమే చికిత్స పొందుతున్నాడని చెప్పారు.

అతడు క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాడో లేదో తనకు తెలియదని, మందులు క్రమం తప్పకుండా తీసుకోకపోతే వ్యాధి మళ్లీ మొదటికి వస్తుందని డాక్టర్ అన్నారు. అతడు తనను చివరిగా కలుసుకుని ఒక సంవత్సరం అయ్యిందని చెప్పారు. కాగా.. బైపోలార్ డిజార్డర్ అనేది తీవ్రమైన డిప్రెషన్‌తో కూడిన ఒక మానసిక అనారోగ్య స్థితి అని నిపుణులు చెబుతున్నారు. దీనిని కౌన్సెలింగ్‌తో పాటు చికిత్స ద్వారా దానిని కంట్రోల్ చేయవచ్చు.

బుల్లెట్ గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ మానసిక వ్యాధికి ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఆయన ఆ పోస్టుకు ఇన్ ఛార్జ్ గా నియమితులయ్యారు. దీంతో ఆయనకు సర్వీస్ రివాల్వయర్ జారీ చేశారు. కాగా నిందితుడు గోపాలకృష్ణ దాస్ గంజాం జిల్లా జలేశ్వరాఖండి గ్రామ నివాసి. బెర్హంపూర్‌లో ఆయన  కానిస్టేబుల్‌గా పోలీసు వృత్తి ప్రారంభించారు. 12 సంవత్సరాల కిందట జార్సుగూడ జిల్లాకు బదిలీ అయ్యాడు. బ్రజ్‌రాజ్‌నగర్ ప్రాంతంలోని గాంధీ చౌక్‌లో పోలీసు పోస్ట్‌కి ఇన్‌చార్జిగా పనిచేసిన తర్వాత ఏఎస్ఐకి లైసెన్స్ పిస్టల్ జారీ అయ్యిందని జార్సుగూడ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్ లో 12 గ్రామాల్లో నీటి కాలుష్యం.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత...

అయితే నిందితుడు ఏఎస్ఐ దాస్ భార్య జయంతి కూడా తన భర్త మానసిక రుగ్మతకు మందులు వాడేవాడని ధృవీకరించారు. ఆయన తన కుటుంబం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నాడని, కాబట్టి క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నాడో లేదో చెప్పలేనని ఆమె పేర్కొంది. 

click me!