బుల్లెట్ గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published : Jan 30, 2023, 09:23 AM IST
బుల్లెట్ గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సారాంశం

ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ లో సంతాపాన్ని తెలియజేశారు. 

ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు పేర్కొన్నారు. 

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ, ఆరుగురి మృతి.. యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి..

ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘‘ఒడిశా ఆరోగ్య మంత్రి శ్రీ నబా కిషోర్ దాస్ జీ దారుణమైన హింసాత్మక చర్యలో మరణించినందుకు దిగ్భ్రాంతి, కలత చెందాను. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరపడంతో నబా కిషోర్ దాస్ ఆదివారం మరణించారు. నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు భావిస్తున్నారు. కాగా.. నబా కిషోర్ దాస్‌ మృతికి రాష్ట్ర గౌరవం ఇవ్వనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 29-31 వరకు మూడు రోజుల పాటు అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది.

హిమాచల్‌ ప్రదేశ్ లో 12 గ్రామాల్లో నీటి కాలుష్యం.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత...

‘‘నబా కిషోర్ దాస్ మృతికి సంతాప సూచకంగా ఆయనకు ప్రభుత్వ గౌరవం ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రాజధానిలో మరణించిన రోజున, అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేస్తారు.’’ అని ప్రకటనలో పేర్కొంది.60 ఏళ్ల మంత్రిని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఐ) గోపాల్ దాస్ కాల్చిచంపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఝార్సుగడ నుంచి భువనేశ్వర్ కు విమానంలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడి అపోలో హాస్పిటల్ లో డాక్టర్ల బృందం ఆయనకు శస్త్రచికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu