రాసలీలల వీడియో : ఆశాకార్యకర్త సస్పెండ్, పంచాయతీ సభ్యుడి మీద చర్యలేవి?

By AN TeluguFirst Published Apr 8, 2021, 10:58 AM IST
Highlights

కర్ణాటక‌ విజయపుర జిల్లా ఇండి తాలూకా తాంబ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ రాసలీలలో పాల్గొన్న ఆశా కార్యకర్తను సస్పెండ్‌ చేశారు. ఈ విషయం మీద జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ, సీసీ కెమెరాలో రికార్డు అయిన రాసలీల సాక్ష్యాధారాన్ని ఆధారంగా సేవల నుంచి తొలగించినట్లు తెలిపారు. 

అయితే గ్రామ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా గ్రామ పంచాయతీ సభ్యుడి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు. 

కర్ణాటకలో మరో రాసలీలల వీడియో వైరల్ !...

మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు కలకలం ఇంకా ముగియకముందో మరో రాసలీలల వీడియో కర్ణాటకను కుదిపేస్తుంది. కర్ణాటక లోని విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త, జీపీ సభ్యుడి రాసలీల వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 

ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతాన్ని ప్రజలు ఇంకా మరువక ముందే మరో వీడియో ఇలా వైరల్ కావడం సర్వత్రా చర్చకు దారి తీసింది. 

click me!