అత్యాచారం కేసు: ఆశారాంకు జీవిత ఖైదు విధించిన కోర్టు

By narsimha lodeFirst Published Jan 31, 2023, 4:21 PM IST
Highlights

అత్యాచారం కేసులో  ఆశారాం కు  జీవిత ఖైదు విధిస్తూ   కోర్టు  ఇవాళ తీర్పును వెల్లడించింది. 

న్యూఢిల్లీ:2013లో జరిగిన  రేప్ కేసులో  గాంధీ నగర్  సెషన్స్ కోర్టు  మంగళవారం ఆశారాం  బాపునకు  జీవిత ఖైదును విధించింది . అంతేకాదు అతనికి రూ. 50 వేల ఫైన్ వేసింది.దని బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ అత్యాచారం కేసులో జోథ్ పూర్ జైలుులో  ఆశారాం ఉన్నాడు.లైంగిక వేధింపుల  కేసులో ఆశారాం బాపూ దోషిగా తేలి జైలుకు వెళ్లడం ఇది రెండోసారి . 2018లో  ప్రత్యేక లైంగిక  వేధింపుల కేసులో  రాజస్థాన్  కోర్టు  ఆయనను దోషిగా నిర్ధారించింది.  ఇప్పటికే  ఈ కేసులో  ఆయన  జోథ్ పూర్ జైలులో ఉన్నారు. 

 గాంధీనగర్  సెషన్స్ కోర్టు  మంగళవారం నాడు మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించి  జీవిత ఖైదు విధించింది.  సూరత్ కు చెందిన  ఓ మహిళ   తనపై ఆశారాం  అత్యాచారానికి పాల్పడినట్టుగా  ఆరోపించింది.   అహ్మదాబాద్ లోని  మోటేరాలోని ఆశ్రమంలో  ఉన్న సమయంలో  తనపై ఆశారాం  అత్యాచారానికి పాల్పడినట్టుగా  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై  2014 జూలై  మాసంలో  పోలీసులు  చార్జీషీట్ దాఖలు చేశారు.  ఈ కేసులో  ఆశారాం బాపును దోషిగా  కోర్టు నిర్ధారించింది.  ఈ కేసులో  ఇవాళ  కోర్లు తీర్పును వెల్లడించింది.  

ఈ కేసులో  68 మందిని  పోలీసులు విచారించారు.  ఈ కేసు విచారించిన  అధికారులకు బెదిరింపులు రావడం అప్పట్లో  కలకలం రేపింది.  .ఈ కేసులో  ఎనిమిది మందిలో  ఒకరు అఫ్రూవర్ గా మారారు.    మహిళపై అత్యాచారం కేసులో  ఆశారాం ను దోషిగా గాంధీనగర్ కోర్టు  దోషిగా నిర్ధారించింది.   మిగిలిన నిందితులను నిర్ధోషులుగా ప్రకటించింది.   ఆశారాం  భార్య లక్ష్మీ, కూతురు, నలుగురు మహిళ అనుచరులను కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.  


 

click me!