సమీర్‌ వాంఖడే నికాహ్ నామా, మొదటి పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన నవాబ్ మాలిక్.. దాడిని మరింతగా పెంచేశారు..

By team teluguFirst Published Oct 27, 2021, 12:27 PM IST
Highlights

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు (Aryan Khan drugs case) విచారణ అధికారిగా ఉన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. 

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు (Aryan Khan drugs case) విచారణ అధికారిగా ఉన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు.  సమీర్ వాంఖడేను(Sameer Wankhede) లక్ష్యంగా చేసుకని నవాబ్ మాలిక్ సంచన వ్యాఖ్యలు చేస్తున్నారు. సమీర్ వాంఖడే పుట్టుకతో ముస్లిం అని.. అతని అసలు పేరు 'సమీర్ దావూద్ వాంఖడే' అని నవాబ్ మాలిక్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాంఖడే పుట్టుకకు సంబంధించిన పత్రానికి సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేసిన నవాబ్ మాలిక్‌.. ‘ఫోర్జరీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. సమీర్ వాంఖడే బాలీవుడ్‌ నటుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు. అనంతరం వారి నుంచి డబ్బు డిమాండ్‌ చేసేవారన్నారు. 

ఇక, తాజాగా నవాబ్ మాలిక్ మరో బాంబు పేల్చారు. సమీర్ వాంఖడే.. నికాహ్ నామా ఇదేనని ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘సమీర్ దావూద్ వాంఖడే, సబానా ఖురేషీల మధ్య నికాహ్.. 2006 డిసెంబర్ 7న ముంబైలోని అంధేరి(పశ్చిమ)లోని లోఖండ్ వాలా కాంప్లెక్స్‌లో జరిగింది. రెండో సాక్షిగా సమీర్ దావూద్ వాంఖడే అక్క యాస్మిన్ భర్త అజిజ్ ఖాన్‌ది’అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. సమీర్ వాంఖడే మొదటి వివాహానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు.

Also read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..

సమీర్ దావూద్ వాంఖడే (Sameer Dawood Wankhede) గురించి తాను బహిర్గతం చేస్తున్న విషయం అతని మతానికి సంబంధించినది కాదని నవాబ్ మాలిక్ అన్నారు. అతను IRS ఉద్యోగం పొందడానికి తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని పొంది.. అర్హులైన షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని తొలగించినా గురించే తాను చెప్తున్నానని మాలిక్ చెప్పుకొచ్చారు. 

ఇక, మంగళవారం రోజున నిబంధనలను ఉల్లంఘించి డబ్బును దోపిడీ చేసేందుకు ప్రజలను తప్పుడు కేసుల్లో ఇరికించారని.. ఈ మేరకు పేరులేని ఓ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారి నుంచి తాను కవరు అందుకున్నట్లు మంత్రి  వెల్లడించారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని మంత్రి పేర్కొన్నారు.

Also read: కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

"నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం ద్వారా పరువు నష్టం కలిగిస్తున్నారు. నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి చేస్తున్నారు. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని నా దివంగత తల్లిని కించపరచడానికి ఉద్దేశించబడింది" అని సమీర్ వాంఖడే ఒక ప్రకటనలో తెలిపారు. తాను దీనిపై న్యాయ పోరాటం చేస్తానని సమీర్ పేర్కొన్నారు. 

click me!