
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రాష్ట్రంలో అధికార వామపక్ష ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్ల రాజీనామా కోరుతూ ఉత్తర్వులు జారీ చేస్తూ వివాదానికి తెరలేపారు. ఈ ఉత్తర్వులపై సీఎం పినరయి విజయన్ గవర్నర్ పై విరుచుకుపడ్డారు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని, ‘ఆర్ఎస్ఎస్’ సాధనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ (ఆరిఫ్ ఎం ఖాన్) తనకు ఉన్న అధికారాల కంటే ఎక్కువ అధికారాలను ఉపయోగిస్తూ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ‘‘వీసీల అధికారాలను ఆక్రమించడం అప్రజాస్వామికం. గవర్నర్ పదవి రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటానికి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదలడానికి కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ కు ఒక టూల్ గా వ్యవహరిస్తున్నారు ’’అని ఆయన వ్యాఖ్యానించారు.
కేరళలోని 9 వర్సిటీల వైస్ చాన్సలర్లు రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజ్ భవన్ పీఆర్ వో పేర్కొన్నారు. కాగా.. కేరళలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఖాన్ ఛాన్సలర్ గా కూడా ఉంటారు.
దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య.. ఎక్కడంటే
గవర్నర్ ఆదేశాలపై స్పందించిన కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ రాజీనామాకు నిరాకరించారు. ‘‘ఒక వీసీ రాజీనామా ఆర్థిక అవకతవకలు. చెడు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏదీ ఇక్కడ జరగలేదు. ఇది బూటకపు ఆరోపణ’’ అని అన్నారు. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు కూడా ఈ చర్యను గతంలో ఖండించారు. దేశంలో మరే ఇతర గవర్నర్ అయినా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
బీజేపీలోకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. షిండేకు షాక్ తప్పదా?.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ !
‘‘ ఉన్నత విద్యా రంగంలో స్తబ్దతను సృష్టించే ప్రయత్నం ఇది. ఈ నిర్ణయం నిస్సందేహంగా ఈ రంగానికి ఎదురుదెబ్బ’’ అని ఆమె అన్నారు. ‘‘ ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నర్ అయినా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారా? ఇది బాధాకరమైన పరిస్థితి. ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే ఆలోచనలో భాగంగా దీనిని చూడొచ్చు. ఉన్నత విద్యా రంగంలో మన విశ్వవిద్యాలయాలు అసాధారణ విజయాలు సాధిస్తున్నాయి ’’ అని ఆమె పేర్కొన్నారు.