ప్రధాని మోడీని క‌లిసిన యాపిల్ సీఈవో టిమ్ కుక్.. భార‌త్ లో పెట్టుబడులపై చ‌ర్చ

Published : Apr 19, 2023, 09:00 PM IST
ప్రధాని మోడీని క‌లిసిన యాపిల్ సీఈవో టిమ్ కుక్.. భార‌త్ లో పెట్టుబడులపై చ‌ర్చ

సారాంశం

Apple CEO Meets PM Modi: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమావేశం అనంతరం టిమ్ కుక్ ట్వీట్ చేస్తూ భారతదేశ భవిష్యత్తుపై టెక్నాలజీ సానుకూల ప్రభావంపై చర్చించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని యాపిల్ అధినేత ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.  

Apple CEO Tim Cook meets PM Modi:  ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమావేశం అనంతరం టిమ్ కుక్ స్పందిస్తూ.. భారతదేశ భవిష్యత్తుపై టెక్నాలజీ సానుకూల ప్రభావంపై చర్చించినట్లు తెలిపారు. భారత్ లో విద్య, తయారీ, పర్యావరణం వంటి అంశాలపై టెక్నాలజీ సానుకూల ప్రభావంపై చర్చించామని, ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

భార‌త్ లో పెట్టుబ‌డులు పెడుతాం.. : టిమ్ కుక్ 

"భారతదేశ భవిష్యత్తుపై సాంకేతిక పరిజ్ఞానం చూపగల సానుకూల ప్రభావం గురించి మీ విజన్ ను మేము పంచుకుంటాము. దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉంది. త‌మ‌కు సాదర స్వాగతం పలికిన ప్రధాని @narendramodi ధన్యవాదాలు. విద్య-డెవలపర్ల నుండి తయారీ-పర్యావరణం వరకు భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత చూపగల సానుకూల ప్రభావం గురించి మీ విజన్ ను మేము పంచుకుంటాము, దేశవ్యాప్తంగా వృద్ధి చెందడానికి.. పెట్టుబడి పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆపిల్ చీఫ్ టిమ్ కుక్ ట్వీట్ చేశారు.

 

 

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తో సానుకూల చ‌ర్చ‌లు జ‌రిగాయి.. : ప్రధాని మోడీ

సాంకేతిక ప్రాతిపదికన భారత్ లో జరుగుతున్న పరివర్తన గురించి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తో సానుకూల చర్చ జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. "ఈ సమయంలో మేము అభిప్రాయాలను పంచుకున్నాము. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది@tim_cook ! విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం, భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక ఆధారిత పరివర్తనలను హైలైట్ చేయడం సంతోషంగా ఉందని" ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

 


 

ఆపిల్ తొలి షోరూమ్ ప్రారంభం

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత పర్యటన సందర్భంగా సోమవారం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో తమ మొదటి స్టోర్ ను ప్రారంభించారు. ఈ సమయంలో స్టోర్ డిజైన్, లేఅవుట్ ను సమీక్షించడానికి అనేక మంది బ్లాగర్లు, టెక్ విశ్లేషకులు ఆహ్వానించబడ్డారు. మంగళవారం నుంచి ఈ స్టోర్ ను సాధారణ ప్రజల కోసం తెరిచారు. అదే సమయంలో ఆపిల్ త్వరలో న్యూఢిల్లీలో మరో షోరూమ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు, ఆపిల్ తన ఉత్పత్తులను ఇ-కామర్స్ సైట్ల ద్వారా భారతదేశంలో విక్రయించేది, కానీ ఇప్పుడు షోరూమ్ తెరిచిన తర్వాత, ప్రజలు ఆపిల్ ఉత్పత్తులను షోరూమ్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఆపిల్ సీఈఓ ఐటీ మంత్రిని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu