అయోధ్య గర్భగుడిలో నల్లనయ్యకు చోటు... మరి ఈ పాలబుగ్గల రామయ్య చోటెక్కడ?

By Arun Kumar PFirst Published Jan 24, 2024, 6:04 PM IST
Highlights

అయోధ్య రామమందిరం గర్భగుడిలో కొలువైన రామయ్య విగ్రహంతో పాటే మరో రెండు విగ్రహాలను శిల్పులు తయారుచేసారు. వాటిలో ఓ బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 

అయోధ్య : శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో అద్భుత రామమందిర నిర్మాణం జరిగింది. వందల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడి ఆ రామయ్య అయోధ్యలో కొలువయ్యారు. అద్భుత శిల్పకళా సంపదతో ఆద్యాత్మిక వైభవం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ఎంత సుందరమో అందులో ప్రతిష్టించిన బాలరామయ్య అంతకంటే సుందరంగా వున్నారు. ఆ నీలమేఘ శ్యాముడి నగుమోము, వజ్రాభరణాలతో కూడిన ఆ శరీరం కళ్లారా చూస్తూ మైమరిపోయేలా వుంది. ఆ నల్లనయ్య దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు.  

అయితే అయోధ్య రామమందిరం గర్భగుడిలో కొలువైన రామయ్య విగ్రహంతో పాటే మరో రెండు విగ్రహాలను శిల్పులు తయారుచేసారు. కానీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాత్రం కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ఎంపికచేసారు. ఈ విగ్రహాన్నే రామమందిరంలో ప్రతిష్టించగా ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ట పూజలు జరిగాయి. కానీ మిగతా రెండు విగ్రహాలు ఎలా వున్నాయో చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇందుకు ఓ విగ్రహం ఫోటో బయటకు వచ్చింది.  

Latest Videos

రాజస్థాన్ కు చెందిన ప్రముఖ శిల్పి సత్యనారాయణ్ పాండే తెల్లని రాతితో ఓ బాలరామడి శిల్పాన్ని చెక్కాడు. ప్రస్తుతం అయోధ్య గర్బగుడిలో వున్న విగ్రహం సైజులోని ఈ విగ్రహమూ వుంది... కానీ రామయ్య రంగు తెల్లగా దగదగ మెరిసిపోతూ వుంది. ఈ విగ్రహం చుట్టూ దశావతారాల ప్రతిరూపాలు, పాదాలవద్ద సీతాదేవి, లక్ష్మణుడి రూపాలున్నాయి. ఈ విగ్రహం ప్రస్తుతం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధీనంలో వుంది. ఆ విగ్రహానికి కూడా అయోధ్య రామమందిరంలో చోటు కల్పించనున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. 

Also Read  తొలిరోజే అయోధ్య రామయ్య అద్భుత రికార్డు... ఏకంగా 5 లక్షలమందా...!

ఇక మూడో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ చెక్కారు. కానీ ఈ విగ్రహ రూపం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. మొత్తం మూడు విగ్రహాలను పరిశీలించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరామయ్య శిల్పాన్నే గర్భగుడిలో ప్రతిష్టించారు. 


 

click me!