ప్రమాదానికి గురైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారు .. ముఖ్యమంత్రికి గాయాలు

Siva Kodati |  
Published : Jan 24, 2024, 05:32 PM ISTUpdated : Jan 24, 2024, 05:39 PM IST
ప్రమాదానికి గురైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారు .. ముఖ్యమంత్రికి గాయాలు

సారాంశం

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా సీఎం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మమతా బెనర్జీ కాలికి, నుదటికి స్వల్పగాయాలయ్యాయి.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా సీఎం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మమతా బెనర్జీ కాలికి, నుదటికి స్వల్పగాయాలయ్యాయి. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకి మరో కారు ఎదురురావడంతో అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు