ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌ పై 350 మీటర్లు లాక్కెళ్లడంతో బాధితుడు మృతి..

By team teluguFirst Published Jan 28, 2023, 9:49 AM IST
Highlights

ఢిల్లీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించి కారు నడిపిన కొందరు విద్యార్థులు ఓ స్కూటీని ఢీకొట్టారు. బాధితుడు కారు బానెట్ పై పడిపోయినా.. కారు ఆపకుండా అలాగే పోనిచ్చారు. పోలీసులు కారును వెంబడించి క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే ఓ బాధితుడు పరిస్థితి విషమించి మరణించాడు. 

ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కంఝవాలాలో జరిగిన దారుణం మరువక ముందే వరుసగా అలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలోని కేశవపురంలో శుక్రవారం తెల్లవారుజామున కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కారు, స్కూటీని ఢీకొట్టింది. ఆ స్కూటీ నడిపే వ్యక్తి కారు బానెట్‌పై పడ్డారు. కానీ కారు ఆపకుండా 350 మీటర్లు అలాగే లాక్కెళ్లింది. దీంతో బాధితుడు మరణించాడు.

భర్త నాలుకను కొరికేసిన భార్య.. స్పృహ తప్పి పడిపోవడంతో...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 19-21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఐదుగురు విద్యార్థులు ఓ వివాహ వేడుకకు హాజరై, మద్యం సేవించి కారులో ఢిల్లీలో రోడ్లపై తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆ కారు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కేశవపురం ప్రాంతంలోని ప్రేరణ చౌక్ వద్ద ఓ స్కూటీని ఢీకొట్టింది. ఆ స్కూటీపై కైలాష్ భట్నాగర్, సుమిత్ ఖరీ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే కారు ఢీకొట్టిన దాటికి కారు బానెట్‌ తెరుచుకోవడంతో స్కూటీ నడుపుతున్న కైలాష్‌ గాలిలోకి ఎగిరి కారు అద్దానికి, బానెట్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. అలాగే సుమిత్ కూడా కారు పైకప్పుపై పడి, కిందపడిపోయాడు. కారు బంపర్‌లో స్కూటీ ఇరుక్కుపోయింది. 

ఈ ప్రమాదం తరువాత నిందితులు కారు ఆపడానికి బదులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కైలాష్‌ను అలాగే ఈడ్చుకెళ్లారు. దీనిని పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కేశవపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన రెండు పీసీఆర్ వ్యాన్‌లు గమనించాయి. హెడ్ కానిస్టేబుల్ సుర్జీత్ సింగ్, కానిస్టేబుల్ రామ్ కిషోర్ 350 మీటర్ల మేర కారును వెంబడించి, అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రవీణ్ అలియాస్ సిల్లి (20), దేవాన్ష్ లు కారు దిగి అక్కడి నుంచి పారిపోయారు. చివరికి వారిని పట్టుకొని అరెస్టు చేశారు.

వార్నీ.. సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్థరాత్రి పడుకుంటే దగ్గరికి వచ్చి..

మరో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు కైలాష్, సుమిత్‌లను దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే కైలాష్ చనిపోయాడు. సుమిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి కారణమైన కారును ప్రవీణ్ కారు నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఓం భరద్వాజ్, హర్ష్ ముద్గల్, దేవాన్ష్ (అందరూ 19 ఏళ్ల వయస్సే) ఉందని పేర్కొన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిమజ్జనం ఊరేగింపులో గన్ ఫైరింగ్.. ఒకరి దుర్మరణం.. బిహార్‌లో ఘటన

నిందితుల్లో కొందరు తాజాగానే  12వ తరగతి పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నారు. ప్రమాద సమయంలో వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఢిల్లీ పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్‌లు 304 (అపరాధపూరితమైన నరహత్య, 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 279 (అవగాహన డ్రైవింగ్ లేదా బహిరంగ మార్గంలో రైడింగ్), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ మోటార్ వెహికల్ రోడ్స్ సెక్షన్ 50, 177, మోటారు వాహనాల చట్టంలోని 39, 192 కింద కేసులు నమోదు చేశారు. 

click me!