భర్త నాలుకను కొరికేసిన భార్య.. స్పృహ తప్పి పడిపోవడంతో...

Published : Jan 28, 2023, 09:11 AM IST
భర్త నాలుకను కొరికేసిన భార్య.. స్పృహ తప్పి పడిపోవడంతో...

సారాంశం

భార్యభర్తల మధ్య గొడవతో ఓ మహిళ దారుణంగా వ్యవహరించింది. భర్త నాలుకను అందిపుచ్చుకుని కొరికేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

ఉత్తరప్రదేశ్ : ఇటీవల కాలంలో భర్తపై భార్య, భార్యపై భర్త దాడులు చేసుకోవడం ఎక్కువ అవుతుంది. చిన్నచిన్న కారణాలకు విడిపోవడం. గొడవలు పడడం. తీవ్రంగా గాయపరచుకోవడం. చివరకు హత్యల దాకా వెళ్లడం కనిపిస్తోంది.  అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. భర్తతో వివాదాల కారణంగా.. ఓ భార్య.. భర్త నాలుకను కొరికి, కోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని లక్నో జిల్లాకు చెందిన ఓ భార్య సల్మాకు  భర్తతో విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా భర్త మున్నాకు దూరంగా  పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే,  మున్నా భార్య పిల్లలను తీసుకువెళ్లడానికి అత్తగారింటికి వచ్చాడు. కానీ సల్మా మాత్రం భర్తతో వెళ్లడానికి నిరాకరించింది.  ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తీవ్రవాదం చోటుచేసుకుంది.

దీంతో సల్మా తీవ్ర అగ్రహావేషాలకు లోనైంది. భర్త నాలుకను నోటితో అందిపుచ్చుకొని కొరికేసింది. నాలుక తెగిపడడంతో  మున్నా తీవ్రంగా  గాయపడ్డాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ గొడవ సమాచారం పోలీసులకు అందింది.  వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నాలుక తెగుబడి స్పృహ తప్పి పడిపోయిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. భర్తను తీవ్రంగా గాయపరిచిన భార్య సల్మాను అదుపులోకి తీసుకున్నారు.  దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్