ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్.. వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ..

By SumaBala Bukka  |  First Published Mar 3, 2023, 8:20 AM IST

వ్యాపారవేత్త ఆమన్ దీప్ సింగ్ ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. 


న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరో అరెస్టు చేసింది. వ్యాపారవేత్త ఆమన్ దీప్ సింగ్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. మొదట ఆయనను ప్రశ్నించిన ఈడీ ఆ తర్వాత అతనిని అదుపులోకి తీసుకుంది. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని గురువారం రోజు  రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. అమందీప్ సింగ్ ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడి  కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూపుతో అమన్దీప్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయి.

ఆప్ ఫంక్షనరీ విజయ్ నాయర్,మనోజ్ రాయ్ లతో పాటు అమన్దీప్ సింగ్ కూడా కీలకపాత్ర పోషించారని సిబిఐ ఎఫ్ఐఆర్ లో తెలిపింది.  అంతకుముందు, ఆదివారంనాడు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనిషి సిసోడియాకు ఐదు రోజుల కస్టడీని న్యాయస్థానం విధించింది. వీరితోపాటు ఈ లిక్కర్ స్కామ్ కేసులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి.

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం : ఐదుగురు నిందితులకు బెయిల్..ఎవరెవరంటే..?

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులపై గురువారం ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బిజెపి నేతలు చెప్పినట్లుగా అరెస్టులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని బిజెపి నేతలు ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిమీద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు. ఎప్పుడు ఎవరిని.. ఏయే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయాలని బిజెపి నేతలు చెబుతారా అని ప్రశ్నించారు.  ఇలా బిజెపి నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యల వల్ల బిజెపి నేతలకే చెడ్డ పేరు వస్తుందని..  ఆ నేతలు చెప్పినట్లుగానే దర్యాప్తు సంస్థలు నడుచుకున్నట్టుగా బయటపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలతో బీజేపీకి మ్యాచ్ ఫిక్సింగ్ కు అద్దం పడుతున్నాయని అన్నారు. ఈడి, సిబిఐ దాడులు అదానీపై ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారు చెప్పొద్దని బిజెపి నేతలకు చెప్పాలని ఆమె తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను  కోరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజీ వాళ్ళ పేర్లు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం లోని రెండో ఛార్జ్ షీట్ లో చేర్చారు. కాగా ఈ చార్జి షీట్ ను అరవింద్ కేజ్రీవాల్ తప్పులు తడక అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

click me!