విషాదం : చనిపోయిన తల్లి పక్కనే రెండో రోజులుగా పడుకుంటూ.. మూడు రోజులు గడిపిన 11యేళ్ల బాలుడు..

Published : Mar 03, 2023, 06:53 AM IST
విషాదం : చనిపోయిన తల్లి పక్కనే రెండో రోజులుగా పడుకుంటూ.. మూడు రోజులు గడిపిన 11యేళ్ల బాలుడు..

సారాంశం

బెంగళూరులో ఓ మహిళ చనిపోగా.. ఆమె కొడుకు రెండు రోజులు ఆమెతోనే గడిపాడు. తల్లి నిద్రపోతుందనుకుని.. లేపొద్దనుకుని బాలుడు గడపడం అందర్నీ కలిచివేసింది. 

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ హృదయ విధారక ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ విషయం తెలియని ఆమె పదకొండేళ్ల కుమారుడు రెండు రోజులపాటు అమ్మ పక్కనే గడిపాడు. మానసిక  అనారోగ్యంతో ఉన్న ఆ బాలుడికి తల్లి చనిపోయిన సంగతి తెలియరాలేదు. అమ్మ పడుకుందని.. నిద్రలేపొద్దు అనుకుంటూ.. రెండు రోజులు గడిపేసాడు. అంతేకాదు రాత్రి తల్లి మృతదేహం పక్కలోనే పడుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పక్కింటి వారు వచ్చి చూడగా ఆమె చనిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది.

హృదయ విధారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. బెంగళూరులో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.. ఆ బాలుడు తల్లి నిద్రపోతుందనుకుని.. విసిగించొద్దని తల్లి దగ్గరికి వచ్చి లేపలేదు. తల్లి చనిపోయిన మొదటి రోజు.. నిద్రపోయిందనుకొని బయటికి వెళ్లి పిల్లలతో ఆడుకుని.. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆరోజు రాత్రి  తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచాక ఆకలేస్తుంది అంటూ తల్లిని లేపాడట. కానీ ఆమె ఎంతకీ లేవకపోవడంతో.. డబ్బులు తీసుకువెళ్లి.. పక్కనే ఉన్న ఓ హోటల్లో రెండు ప్లేట్ల ఇడ్లీ తీసుకువచ్చి.. తాను ఒకటి తిని.. తల్లికి ఒకటి పక్కనే ఉంచాడట.

ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపుపై భ‌గ్గుమ‌న్న తెలంగాణ.. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళ‌న‌లు

ఆరోజు కూడా యధావిధిగా.. బయటికి వెళ్లి పిల్లలతో ఆడుకుని సాయంత్రం వచ్చి.. తల్లి పక్కలో పడుకున్నాడు. మూడో రోజు కూడా రెండో రోజు నాటి సీన్ రిపీట్ అయింది. అయితే చుట్టుపక్కల ఉన్నవారికి బాలుడి పరిస్థితి తెలుసు. కాబట్టి.. రెండు రోజుల నుంచి తల్లి కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంట్లో నుంచి ఆ బాలుడు ఒక్కడే రావడం వెళ్లడం గమనించారు. దాంతో వారు ఏం జరిగింది అని ఆరా తీశారు. దీనికి తోడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమనించారు.

అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. మృతదేహం పక్కనే 11 ఏళ్ల బాలుడు పడుకుని ఉన్నాడు. వారికి విషయం అర్థమైంది. వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు. బెంగుళూరు ఆర్టి నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గంగానగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చరీకి తరలించారు.  చనిపోయిన వ్యక్తిని అణ్ణమ్మ (40)గా గుర్తించారు. రెండేళ్ల క్రితం  ఆమె భర్త మృతి చెందాడు. దీంతో  బతుకుతెరువు కోసం కూలీ పనులు చేసుకుంటూ  మానసిక సమస్యతో ఉన్న కొడుకుతో కలిసి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!