షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ పై యూపీలో కేసు నమోదు.. లఖ్ నవూ రియల్ ఎస్టేట్ వివాదంలో..

Published : Mar 03, 2023, 07:40 AM ISTUpdated : Mar 03, 2023, 07:41 AM IST
షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ పై యూపీలో కేసు నమోదు.. లఖ్ నవూ రియల్ ఎస్టేట్ వివాదంలో..

సారాంశం

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ మీద ఓ ఆస్తవివాదంలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. 

లక్నో : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదయింది. ఓ ఆస్తి వివాదంలో ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా పోలీసులు  తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థకు  చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్ఐఆర్  నమోదయినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా షారుక్ ఖాన్ భార్య ఉన్నారు. ‘తుల్సియానీ బిల్డర్స్’ చీఫ్ ఎండీ అనిల్ కుమార్ తుల్సియానీ, డైరెక్టర్ మహేష్ తుల్సీయానీలతోపాటు.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ మీద ఎఫైర్ నమోదయింది..  

ఫిబ్రవరి 25న కిరీట్ జస్వంత్ షా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో.. 2017లో తుల్సియాని బిల్డర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి తాను 85.46 లక్షలకు ఓ ఫ్లాట్ కొనుగోలు చేశానని.. గౌరీ ఖాన్ ప్రచారం కారణంగానే అది కొనుగోలు చేశానని తెలిపాడు. 2016లోగా  ఆ ఫ్లాట్ అప్పగించాల్సి ఉందని అందులో పేర్కొన్నాడు. అయితే గడువులోగా ఫ్లాట్ తనకు ఇవ్వలేదన్నాడు. అందులో 2017లో నష్టపరిహారం కింద తనకు రూ. 22.70 లక్షలు ఇచ్చారని తెలిపాడు.  

విషాదం : చనిపోయిన తల్లి పక్కనే రెండో రోజులుగా పడుకుంటూ.. మూడు రోజులు గడిపిన 11యేళ్ల బాలుడు..

అంతేకాదు మిగతా సొమ్మును మరో ఆరు నెలల్లోగా ఫ్లాట్ అప్పగించకపోతే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారని పేర్కొన్నాడు. అయితే తనకు చెప్పినట్లుగా తన డబ్బు తనకు  తిరిగి ఇవ్వలేదని  తెలిపాడు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వకపోగా అనిల్ కుమార్ తుల్సియాని, మహేష్ తుల్సియాని తన ఫ్లాట్ను మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు ఐపిసి 409కి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు యూపీ పోలీసులు తెలిపారు. దీనిమీద అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి చౌదరి మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!