తీరాన్ని తాకిన అంపన్ తుఫాన్: బెంగాల్‌, ఒడిశాలకు తీవ్ర హెచ్చరికలు

By Siva KodatiFirst Published May 20, 2020, 4:53 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ అంపన్ ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్‌లో తీరాన్ని తాకింది. భీకరమైన ఈదురు గాలులతో ఇది మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ అంపన్ ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్‌లో తీరాన్ని తాకింది. భీకరమైన ఈదురు గాలులతో ఇది మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య సుందర్భన్ వద్ద అంపన్ తుఫాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

Aslo Read:వణికిస్తున్న అంఫాన్ తుఫాను.. అసలు ఈ సైక్లోన్ కి పేరు ఎవరు పెడతారు?

ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లోని దాదాపు 4.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సూపర్ సైక్లోన్ కారణంగా ఇప్పటికే ఒడిషా, బెంగాల్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.

ఆయా ప్రాంతాల్లో ఈదుురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తీరంలో రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

Also Read:అంఫన్ తుఫాను ఎఫెక్ట్... మత్స్యకార గ్రామంపై విరుచుకుపడుతున్నరాకాసిఅలలు

తుఫాను తీరం దాటాక గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటి బంగ్లాదేశ్ వైపు వెళ్లాక అంపన్ తీవ్ర వాయుగుండంగా మారి, తర్వాత బలహీనపడుతుందని వారు చెప్పారు.

click me!