బెంగళూరులో భారీ పేలుడులాంటి శబ్దం, భయాందోళనలకు లోనైన ప్రజలు!

By Sree sFirst Published May 20, 2020, 3:11 PM IST
Highlights

నేటి మధ్యాహ్నం 1.45 ప్రాంతంలో బెంగళూరు నగరంలో ఉన్నట్టుండి  ఒక  పెద్ద  శబ్దం వినిపించింది. సౌత్ బెంగళూరు ప్రాంతంలోని వైట్ ఫీల్డ్, హెచ్ ఎస్ ఆర్  లేఅవుట్  ఏరియాల్లో ఈ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

నేటి మధ్యాహ్నం 1.45 ప్రాంతంలో బెంగళూరు నగరంలో ఉన్నట్టుండి  ఒక  పెద్ద  శబ్దం వినిపించింది. సౌత్ బెంగళూరు ప్రాంతంలోని వైట్ ఫీల్డ్, హెచ్ ఎస్ ఆర్  లేఅవుట్  ఏరియాల్లో ఈ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. అసలే మొన్న కర్ణాటక లో ఒకింత భూమి కంపించిన నేపథ్యంలో ప్రజలంతా దీన్ని కూడా భూకంపమేమో అని భావించారు. 

Did You Heard Any Strong Sound? Like a Tornado Wave or an Earthquake? In Bangalore.

— Anshul Choubey (@tweettoansh)

తొలుత ఇది సౌత్ బెంగళూరు ప్రాంతంలో మాత్రమే వినిపించిందని భావించినా తరువాత ఈ శబ్దం అన్ని ప్రాంతాల్లో కూడా వినిపించిందని ప్రజలంతా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. 

The skies in Bangalore seems like a war zone from morning. And then a thud scary loud blast in the afternoon. Was it a

— Anita Noronha (@Aninor28)

కానీ కర్ణాటక విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఇది భూకంపం కాదని, రిక్టర్ స్కేల్ పై ఎటువంటి కంపనలు రికార్డు అవలేదని వారు తెలిపారు. పోలీసు విభాగం తో మాట్లాడినప్పుడు ఇది బహుశా ఫైటర్ ప్లేన్ వల్ల వచ్చిన సోనిక్ బూమ్ అయి ఉండొచ్చని అన్నారు. 

All okay ! All of sudden heard a Bang ... Felt like someone smashed my window.. Then l was like... Wait , am in 2nd floor.. WTH ..2020 be kind yaar... 🙏🏻

— Sam (@NanaBaiya)

మరికొద్ది సేపట్లో పోలీసులు అధికారికంగా ఈ విషయంఫై ప్రకటన చేయనున్నారు. కొందరు ప్రజలు పిడుగుపాటు అనుకుంటే... మరికొందరు ఏదో పర్యావరణంలో వచ్చిన మార్పు అని అనుకున్నారు. ఇంకొందరు నెటిజెన్ల యధావిధిగా తమ క్రియేటివిటీని చూపించారు. 

click me!