గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోవచ్చు: అమిత్ షా

By Rajesh KarampooriFirst Published Nov 30, 2022, 2:56 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెరపడింది. డిసెంబర్ 1న తొలి దశలో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యాలు చేశారు.  

సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెరపడింది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్,ఆప్ లు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా  అధికారానికి దక్కించుకోవాలని ఆప్,కాంగ్రెస్ లు వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ తమ తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించారు. అధికారం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.  ఇదిలా ఉండగా.. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యాలు చేశారు. గుజరాత్ తొలి దశ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఖాతాను కూడా తెరవలేకపోవచ్చుననీ,గుజరాత్‌లో బీజేపీ అపూర్వ విజయాన్ని నమోదు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. 

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. గుజరాత్‌లో బీజేపీ అపూర్వ విజయాన్ని నమోదు చేస్తుందని, తమ పార్టీపైనా, తమ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా  షా మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పార్టీకి ఉందని, అయితే ఆ పార్టీని అంగీకరించాలా?  వద్దా?  అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఛాందసవాదం గురించి మాట్లాడేటప్పుడు, మతంతో సంబంధం లేదని అన్నారు.దేశ వ్యతిరేక అంశాల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. గుజరాత్ ప్రజల మదిలో  ఆప్ కు స్థానం లేదనీ, ఈ విషయం తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉండాలని అన్నారు. బహుశా 'ఆప్' అభ్యర్థుల పేర్లు గెలిచిన అభ్యర్థుల జాబితాలో కనిపించకపోవచ్చని అన్నారు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాల్‌పై షా మాట్లాడుతూ..కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కానీ అది జాతీయ స్థాయిలో సంక్షోభం ఎదుర్కొంటుందనీ, దాని ప్రభావం గుజరాత్‌లో కూడా కనిపిస్తుందని అన్నారు. 

డిసెంబర్ 1న తొలిదశ పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ డిసెంబర్ 1 న జరుగనున్నది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఓటర్లు తమ ఓట్లను దాఖలు చేయనున్నారు. ఈ 19 జిల్లాలు సౌరాష్ట్ర , దక్షిణ గుజరాత్ పరిధిలోకి వస్తాయి. ఆ జిల్లాలన్నింటిలో కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులకు రిజర్వు చేయబడ్డాయి. మొదటి దశ పోలింగ్‌లో మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరగనుండగా..అందులో 68 స్థానాలు జనరల్ కేటగిరీకి చెందినవి. షెడ్యూల్డ్ కులాల (SC) వర్గానికి 7 సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి.

click me!