భారత్ నుండి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
న్యూఢిల్లీ: మాల్దీవులు దాని సహజమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ది చెందింది. మాల్దీవులకు భారత దేశం నుండి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ద్వీప దేశానికి చెందిన పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గతంలో అగ్రస్థానంలో ఉన్న భారత పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం ఐదో స్థానానికి పడిపోయింది.ఈ నెల 28 నాటికి అధికారిక గణాంకాల మేరకు భారతీయ సందర్శకులలో గణనీయమైన తగ్గుదల కన్పిస్తుంది. మాల్దీవులకు భారత దేశం నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లేవారు.
also read:బ్రిడ్జికి కలెక్టర్ పేరు: కోనసీమ జిల్లావాసుల అభిమానం ఇదీ..
undefined
మాల్దీవుల ప్రభుత్వం డేటా విడుదల చేసిన గణాంకాలు
1.రష్యా: 18,561 మంది పర్యాటకులు ( 10.6 శాతం మార్కెట్ వాటా, 2023 లో ర్యాంక్ లో రెండో స్థానం)
2.ఇటలీ: 18,111 పర్యాటకులు (మార్కెట్ లో 10.4 శాతం, 2023లో ఆరో ర్యాంక్)
3.చైనా: 16,529 పర్యాటకులు(మార్కెట్ లో 9.5 శాతం వాటా, 2023లో మూడో ర్యాంక్)
4.యూకే: 14,588 పర్యాటకులు( మార్కెట్ లో 8.4 శాతం, 2023లో నాలుగో ర్యాంక్)
5.ఇండియా: 13,989 పర్యాటకులు (మార్కెట్ లో 8.0 శాతం వాటా, 2023లో ర్యాంక్ 1)
6.జర్మనీ: 10,652 పర్యాటకులు (మార్కెట్ లో 8.0 శాతం వాటా)
7.అమెరికా: 6,299 పర్యాటకులు (మార్కెట్ లో 3.6 శాతం వాటా, 2023లో ఏడో ర్యాంక్)
8. ఫ్రాన్స్:6,168 పర్యాటకులు (మార్కెట్ లో 3.5 శాతం వాటా, 2023లో ఎనిమిదో ర్యాంక్)
9. పోలాండ్: 5,109 పర్యాటకులు(మార్కెట్ లో 2.9 శాతం వాటా, 2023లో 14వ, ర్యాంక్)
10.స్విట్జర్లాండ్: 3,330 పర్యాటకులు (మార్కెట్ లో 1.9 శాతం వాటా, 2023లో 10వ, ర్యాంక్)
మాల్దీవులు,భారత్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ నెల 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ లో పర్యటించారు. ఆ తర్వాత మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గింది. అదే సమయంలో లక్షద్వీప్ నకు భారత పర్యాటకుల సంఖ్య పెరిగింది.
also read:19 మంది పాకిస్తాన్ నావికుల కిడ్నాప్: కాపాడిన భారత్ నేవీ
భారత్ ను లక్ష్యంగా చేసుకొని మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ లో పర్యటించిన మోడీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ విషయమై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో భారత్ నుండి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం తగ్గించారు.ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మయిజుపై అభిశంసననకు విపక్షాలు రంగం సిద్దం చేశాయి.