వార్నీ.. నిత్యానంద వలలో అమెరికా నగరాలు.. "సిస్టర్ సిటీ" స్కామ్‌తో కుచ్చుటోపీ.. వెలుగులోకి రావడంతో...

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 9:17 AM IST
Highlights

నెవార్క్, నకిలీ "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" మధ్య సోదర-నగర ఒప్పందంపై ఇప్పుడు దుమారం చెలరేగింది. దీంతో నెవార్క్ నగరం తన ఒప్పందాన్ని రద్దు చేసింది. 

న్యూయార్క్ : స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద లీలలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భారత్ నుంచి పరారీలో ఉన్న నిత్యానంద ఎక్కడో ‘కైలాస’ అని సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" దేశం పేరుతో 30 అమెరికన్ నగరాలతో "సాంస్కృతిక భాగస్వామ్యం" కుదుర్చుకున్నట్లు ఒక మీడియా నివేదిక తెలిపింది, అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ నగరం ఈ మేరకు వివరాలు తెలిపింది. ఇది పెద్ద స్కాం అని తెలియడంతో కల్పిత దేశంతో "సిస్టర్-సిటీ" ఒప్పందాన్ని రద్దు చేసింది.

నెవార్క్,  నకిలీ "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం మీద ఈ సంవత్సరం జనవరి 12న సంతకాలు చేశారు. ఈ సంతకాల కార్యక్రమం నెవార్క్‌లోని సిటీ హాల్‌లో జరిగింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న నిత్యానంద, 2019లో "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" అనే దేశాన్ని స్థాపించినట్లు పేర్కొన్నారు. రిచ్‌మండ్, వర్జీనియా నుండి డేటన్, ఒహియో వరకు, బ్యూనా పార్క్, ఫ్లోరిడా వరకు మ్యాప్‌లో అక్షరాలా కైలాస అనే నకిలీ దేశంతో సాంస్కృతిక భాగస్వామ్యంపై సంతకం చేసిన 30 అమెరికన్ నగరాలు ఉన్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

దీనిమీద ఫాక్స్ న్యూస్ మరింత మాట్లాడుతూ.. కనీసం గూగుల్ లో వెతికినా కైలాసా గురించి వివరాలు తెలిసేవి. కానీ ఒప్పందాలు చేసేముందు దానికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు అమెరికా నగరాలు చేయలేదు. అంతేకాదు "ఇప్పటివరకు చాలా నగరాలు ఈ ప్రకటనలు నిజమని ధృవీకరించాయి" అని నివేదిక పేర్కొంది.

నిత్యానంద, ఆయ‌న కైలాస దేశం గురించి చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా..?

ఈ విషయం తెలిసిన వెంటనే నెవార్క్ కౌన్సిల్‌మన్ ఒప్పందాన్ని రద్దు చేశామని నెవార్క్ అధికారులు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకునే ఏ నగరమైనా ముందుకు వెళ్లాలంటే "మానవ హక్కులకు సంబంధించి మంచి ప్రమాణాలతో ఉండాలి.

"సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్‌ను ఈ వివాదంలోకి లాగాలనుకోవడం లేదు. ఇది ఒక పొరపాటు.. అనుకోకుండా జరిగింది. ఇకపై జరగదు," అని చెప్పారు. మానవ హక్కులు లేని సోదరి నగరంతో నెవార్క్ సంబంధాలు పెట్టుకోదు అన్నారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ఒక నెవార్క్ నివాసి చెప్పిన మాటలని ఉటంకిస్తూ, నకిలీ దేశంతో సోదరి-నగర ఒప్పందం నగరానికి ఇబ్బందికరమైన ఎపిసోడ్ అన్నారని తెలిపింది. "ఒప్పందం కుదుర్చుకునేముందు కనీసం దానికి తగిన పరిశోధన చేయకపోవడం ఇబ్బందికరంగా ఉందని నేను భావిస్తున్నాను" అని ఆ పౌరుడు అన్నారు.

గత నెల, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో జరిగిన రెండు యూఎస్ బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు. ఫిబ్రవరి 22న మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ నిర్వహించిన 'నిర్ణయాత్మక వ్యవస్థల్లో మహిళల సమాన, సమ్మిళిత ప్రాతినిధ్యం'పై సాధారణ చర్చ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న ఆర్థిక, సామాజిక సాంస్కృతిక హక్కులు స్థిరమైన అభివృద్ధిపై సాధారణ వ్యాఖ్యపై సాధారణ చర్చలు జరిగాయి. వీటికి కైలాస ప్రతినిధులు హాజరయ్యారు.

ఐక్యరాజ్యసమితి ఫోరమ్‌లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పాల్గొనడంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం అటువంటి పబ్లిక్ ఈవెంట్‌ల కోసం నమోదు చేసుకునేందుకు ఎన్ జీవోలు, సాధారణ ప్రజలకు అనుమతి ఉందని తెలిపారు. 

click me!