పోలీసుల అత్యుత్సాహం.. నాలుగేళ్ల చిన్నారిపై క్రిమినల్ కేసు.. బెయిల్ కోసం కోర్టుకు బాలుడు..

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 8:34 AM IST
Highlights

2021లో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఆరోపణలను నేపథ్యంలో ఓ 4 ఏళ్ల చిన్నారిపై బీహార్ లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. దీంతో బెయిల్ కోసం కోర్టుకు రావడం అందరినీ విస్మయపరిచింది. 

పాట్నా : బీహార్ లో పోలీసుల అత్యుత్సాహంలో ఓ నాలుగేళ్ల చిన్నారి కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. తల్లి చంకలో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ చిన్నారిని.. అతనికి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన తల్లి వేదనను చూడడానికి న్యాయవాదులతో సహా.. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకున్నారు. చిన్నారికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అతని మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ విషయం ఆ చిన్నారి తల్లికి గురువారమే తెలిసింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే... 

2021లో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఆరోపణలను నేపథ్యంలో ఓ 4 ఏళ్ల చిన్నారి మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. అతడికి బెయిల్ మంజూరు కోసం బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. రెండేళ్ల క్రితం కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేశారనే ఆరోపణపై బెగుసరాయ్ పోలీసులు రెండేళ్ల చిన్నారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చిన్నారిపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని సీనియర్ న్యాయవాది రాజేష్ సింగ్ ప్రశ్నిస్తూ.. ఏడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చేసిన ఏ చర్యను నేరంగా పరిగణించలేమని, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 82 ప్రకారం కేసులు పెట్టలేమని, శిక్షించలేమని అన్నారు. 

ప్రేమను తిరస్కరించిందని.. యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది..

తన బిడ్డపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్న విషయం రెండేళ్ల పాటు ఆ తల్లికి తెలియదు. ఆమెకు గురువారం నాడు ఆ విషయం తెలిసి తన బిడ్డకు బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. "నా మైనర్ కొడుకు బెయిల్ కోసం నేను కోర్టుకు వచ్చాను" అని ఆమె కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో అన్నారు. తన తల్లి తనను ఎక్కడికి తీసుకువచ్చిందో, ఎందుకు తీసుకువచ్చిందో.. అర్థంకాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చిన్నారిని చూసేందుకు న్యాయవాదులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు కోర్టు ఆవరణలో గుమిగూడారు. 

కేరళలో వలస కార్మికుడికి రూ. 75 లక్షల లాటరీ.. వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు.. ఎందుకో తెలుసా?

ఏప్రిల్ 10. 2021న బెగుసరాయ్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో చిన్నారి, అతని తల్లిదండ్రులతో సహా ఎనిమిది మంది వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. నిందితులందరూ తమ ప్రాంతంలో పోలీసులు ఉంచిన బారికేడ్‌ను బద్దలు కొట్టి, కంటైన్‌మెంట్ జోన్ నుండి బయటకు వెళ్లడం ద్వారా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేశారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. స్థానిక చౌకీదార్ రూపేష్ కుమార్ వాంగ్మూలం మేరకు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది, అతను ఈ విషయాన్ని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలిపాడు. ఐపీసీ సెక్షన్ 82 కింద చిన్నారిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు అడ్వకేట్ సింగ్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే నాటికి తన కుమారుడి వయసు రెండేళ్లు మాత్రమేనని తల్లి చెప్పింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

click me!