ప్రేమను తిరస్కరించిందని.. యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది..

Published : Mar 18, 2023, 07:39 AM IST
ప్రేమను తిరస్కరించిందని.. యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది..

సారాంశం

తన మీద పడ్డ హత్య కేసు వల్ల ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రియుడు దారుణానికి తెగించాడు. ప్రియురాలి గొంతుకోసి హత్య చేశాడు. 

తమిళనాడు : తమిళనాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ  ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను  నిరాకరించిన యువతిని గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఈ మేరకు వివరాలను తెలియజేశారు.  మృతురాలు ధరణి (20). తమిళనాడు రాష్ట్రంలోని విళుపురం జిల్లా రాధాపురం గ్రామానికి చెందిన సుధన్ అనే వ్యక్తి కుమార్తె. అదే ప్రాంతంలో ఉన్న నర్సింగ్ కాలేజీలో చదువుకుంటుంది. గత మూడేళ్లుగా.. మధురపాకం గ్రామానికి చెందిన ఓ యువకుడు గణేషన్ ఆ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉంది.

ఈ క్రమంలోనే గణేషన్ మీద హత్య కేసు నమోదయింది. ఈ కేసులో అతడి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఈ విషయం ధరణికి తెలిసింది. దీంతో అతనితో మాట్లాడడం మానేసింది.  మాట్లాడడం మానేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ధరణి తన ఇంటి ఆవరణలో ఉండగా అక్కడికి వచ్చిన గణేషన్  కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. 

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి  చుట్టుపక్కల వారు చూసేలోపే ధరణి నెత్తుటి మడుగులో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.  దీని మీద పోలీసులకు సమాచారం అందడంతో ఘటనస్థలికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

చైనీస్ లోన్ యాప్ కేసులో 7 సంస్థలు సహా ఐదుగురిపై ఈడీ కేసు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన ఈ ఫిబ్రవరిలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది వివాహిత మీద కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందని.. నాలుగేళ్ల తరువాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ వివాహిత తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.  దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. చంద్‌ఖేడాకు చెందిన 24 ఏళ్ల యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్యాచ్‌మేట్ ప్రతిపాదనను తిరస్కరించింది. నాలుగేళ్ల తర్వాత, ఆమెను వెతుక్కుంటూ వచ్చిన అతను.. పలుమార్తు కత్తితో పొడిచారు. 

బాధితురాలు రిద్ధి సోని గాంధీనగర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ప్రాసెస్ అసోసియేట్‌గా పనిచేస్తోంది.  ఆమె తన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ బ్యాచ్‌మేట్, అస్టోడియాలోని ధాల్ ని పోల్‌లో నివాసం ఉంటున్న సర్వేష్ రావల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ రోజు ఉదయం అతను సడెన్ గా తన ఇంట్లో ప్రత్యక్షమయ్యాడని తెలిపింది. తన భర్త యష్ సోనీ, టిసిఎస్‌లో పనిచేస్తున్నాడని.. రావల్ వచ్చిన సమయంలో అతను కూడా ఇంట్లో ఉన్నారని తెలిపింది. ఇన్నేళ్ల తరువాత తనకు సర్ ఫ్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్లు రావల్ తెలిపాడు. అంతేకాదు తన బ్యాచ్ మేట్స్ మరికొంతమంది కూడా వస్తున్నారని చెప్పాడు. ఆమె ఇది నిజమే అని నమ్మింది. 

మరికొంతమంది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పడంతో.. వారికి టీ ఇచ్చే ఉద్దేశ్యంతో భర్తను పాలు తెమ్మని చెబితే.. అతను బైటికి వెళ్లాడు. ఆ సమయంలో సోనీ.. రావల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లింది. అయితే "అతను అకస్మాత్తుగా నా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి, నా జుట్టును పట్టి లాగి, నా గొంతు కోయడానికి ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన నేను కత్తిని పట్టుకుని నన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించాను. మెడకు అరచేయి అడ్డుపెట్టడంతో నా అరచేతిపై కత్తిగాట్లు పడ్డాయి. నేను గొంతు కోయనివ్వకపోవడంతో.. నా వెనుకభాగంలో చాలాసార్లు కత్తితో.. నేను తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. నా మోకాళ్ల మీద కత్తితో కోశాడు’’ అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !