అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం కూలిపోయేముందు ఏం జరిగిందో మినిట్ టు మినిట్ డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.
Ahmedabad Plane Crash : గత నెలజూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోవడంతో 260 మంది మరణించారు. దాదాపు నెలరోజుల పాటు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసి 15 పేజీల ప్రాథమిక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఇందులో AI171 విమానం కూలిపోవడానికి ముందు జరిగిన 98 సెకన్ల ఘటనల గురించి వివరించింది.
ఎయిరిండియా విమానం మధ్యాహ్నం 1:38కి టేకాఫ్
జూన్ 12న టేకాఫ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఎయిరిండియా I171 విమానం బయలుదేరింది. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో కేవలం 32 సెకన్లు మాత్రమే ఉండి కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం 284 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది. తర్వాతి రెండు సెకన్లలో విమానం 287 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత విమానం చక్రాలు నేలనుండి పైకి లేచాయి.
తర్వాతి మూడు సెకన్లలో విమానం 334 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. దీంతో విమానం ఎత్తు తగ్గిపోయి RAT (రామ్ ఎయిర్ టర్బైన్)ను ఉపయోగించాల్సి వచ్చింది. రెండు ఇంజిన్లు ఆగిపోయినా లేదా హైడ్రాలిక్ పవర్ కోల్పోయినా RATను ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ ఎత్తులో RAT పనిచేయదు.
టేకాఫ్ నుండి క్రాష్ వరకు మినిట్ టు మినిట్ డిటెయిల్స్
11:17 – విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకుంది.
11:55 – పైలట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది.
12:10 – సాంకేతిక తనిఖీ తర్వాత విమానాన్ని బయలుదేరడానికి అనుమతించారు.
12:35 – సిబ్బంది బోర్డింగ్ గేట్ వద్దకు వస్తున్నట్లు CCTVలో కనిపించింది.
1:18:38 – విమానం బే 34 నుండి బయలుదేరింది.
1:25:15 – విమానానికి టాక్సీ క్లియరెన్స్ వచ్చింది.
1:26:08 – విమానం టాక్సీ ప్రారంభించింది.
1:37:33 – విమానానికి టేకాఫ్ క్లియరెన్స్ వచ్చింది.
1:37:33 – విమానం టేకాఫ్ కోసం పరుగు ప్రారంభించింది.
1:38:33 – విమానం 283 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది.
1:38:35 – విమానం 287 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది.
1:38:39 – విమానం టేకాఫ్ అయ్యింది.
1:38:42 – విమానం 333 కి.మీ./గం. వేగాన్ని అందుకుంది.
ఆ వెంటనే: ఇంజిన్ 1, 2 ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్‌లు CUTOFFకి వెళ్ళాయి.
1:38:47 – RAT (రామ్ ఎయిర్ టర్బైన్)ను ఉపయోగించారు. విమానం ఎత్తు తగ్గడం ప్రారంభించింది.
1:38:52 – ఇంజిన్ 1 కట్ఆఫ్‌ను RUNకి తీసుకొచ్చారు.
1:38:54 – APU ఇన్లెట్ డోర్ తెరుచుకోవడం ప్రారంభించింది.
1:38:56 – ఇంజిన్ 2 కట్ఆఫ్‌ను RUNకి తీసుకొచ్చారు.
1:39:05 – పైలట్ MAYDAY కాల్ చేశారు.
1:39:11 – EAFAR రికార్డింగ్ ఆగిపోయింది, విమానం కూలిపోయింది.