39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ: ఏపీ నుండి రఘువీరారెడ్డికి చోటు, తెలంగాణకు నిరాశే

By narsimha lode  |  First Published Aug 20, 2023, 2:10 PM IST

కాంగ్రెస్ పార్టీ 39 మందితో వర్కింగ్ కమిటీని ఏర్పాటు  చేసింది.  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  వర్కింగ్ కమిటీని ప్రకటించారు.


 

న్యూఢిల్లీ: 39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  39 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చోటు దక్కింది.

Latest Videos

 

Congress president Mallikarjun Kharge constitutes the Congress Working Committee. pic.twitter.com/lsxTK8rcei

— ANI (@ANI)

ప్రత్యేక ఆహ్వానితులుగా  ఏపీకి చెందిన పల్లంరాజు, తెలంగాణ నుండి వంశీచంద్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ నాయకత్వం. శాశ్వత ఆహ్వానితులుగా  బి. సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులకు అవకాశం కల్పించింది.ఇక తెలంగాణ నుండి ఈ జాబితా కింద మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన మాజీ మంత్రి   ఎన్. రఘువీరారెడ్డి  క్రియాశీల రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నారు. తన స్వంత గ్రామం నీలకంఠాపురంలోనే ఉంటున్నారు. వ్యవసాయ పనులతో పాటు గ్రామాభివృద్దిపై  కేంద్రీకరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా  రాహుల్ గాంధీ  పాదయాత్ర  కర్ణాటక నుండి అనంతపురం జిల్లా సరిహద్దుల నుండి ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో రఘువీరారెడ్డి  రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు.  

దీంతో  రఘువీరారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం సాగింది. అయితే  రాహుల్ గాంధీకి  స్వాగతం పలికేందుకే ఆయన  పరిమితమయ్యారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో ఆయన  ఎక్కువగా పాల్గొనలేదు.అయితే  సీడబ్ల్యూసీలో  రఘువీరారెడ్డికి చోటు దక్కడంతో ఆయన  మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  

also read:మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై చర్చ

ఏపీ నుండి  మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు, కొప్పుల రాజుకు  సీడబ్ల్యూసీ లో చోటు దక్కింది. ఇక తెలంగాణ నుండి  మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహలకు మాత్రమే అవకాశం దక్కింది.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా  ఇతరులకు ఎవరికి కూడ  సీడబ్ల్యూసీలో అవకాశం రాలేదు.భారత్ జోడో యాత్రలో  కేసీ వేణుగోపాల్ తో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితుడిగా  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు సీడబ్ల్యూసీలో అవకాశం దక్కింది. 

click me!