
అవి కర్ణాటకలోని హిరియూర్ తాలూకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాలు. రైతులందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆకాశంలో ఓ చిన్న సైజు విమానం వేగంగా ఎగురుకుంటూ వచ్చింది. సమీపంలోని పొలంలో కుప్పకూలిపోయింది. అక్కడున్నవారికి అదేంటో అర్థం కాలేదు. దగ్గరికి వెళ్లి చూశారు. అందులో ఎవరూ కనిపించలేదు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారొచ్చి అందేంటో గుర్తించారు.
ఇంతకీ అదేంటంటే ?
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) డెవలప్ చేసిన మానవరహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) విమానమే కర్ణాటకలోని వడ్డికెరె గ్రామ పరిసరాల్లో కుప్పకూలిందని అధికారులు గుర్తించారు. ఆదివారం అందరూ పొలాల్లో ఉండగా.. ఓ పొలంలో అది క్రాష్ ల్యాండ్ అయ్యింది. దానిని తపస్ 07 ఏ-14గా గుర్తించిన యూఏవీ విమానంగా గుర్తించారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు ఘటనా స్థలానికి గుంపులుగా చేరుకున్నారు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు దీనిపై సమాచారం అందించారు. అయితే ఈ విమానం కూలిపోయిన తరువాత ఏర్పడిన దృష్యాలను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఈ వీడియోల్లో యుఏవీ పూర్తిగా విరిగిపోనట్టు కనిపిస్తోంది. అలాగే దానికి సంబంధించిన పరికరాలు పొలంలో ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
కాగా.. ఈ ఈ విషయంపై డీఆర్డీవో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. బియాండ్ హారిజాన్ అని సంక్షిప్తంగా పిలుచే టపాస్-బీహెచ్ యూఏవీ, స్వదేశీ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఓర్పు తరగతి మానవరహిత వైమానిక వాహనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏరో ఇండియా ఎయిర్ షో, ఏవియేషన్ డిస్ ప్లే 2023 లో ఇది తన ప్రారంభ ఫ్లైట్ ప్రదర్శనను ఇచ్చింది.
సాయుధ దళాల ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజిషన్, ట్రాకింగ్ అండ్ రికానిసెన్స్ (ఇస్టార్) అవసరాలను పరిష్కరించడానికి డీఆర్డీవో ఈ తపస్ ను రూపొందించింది. 18 గంటలకు పైగా ఆకాశంలో ఎగిరే యూఏవీ 28,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ముందుగానే ప్రొగ్రామ్ చేసిన విమాన ప్రణాళికల ఆధారంగా స్వయంప్రతిపత్తితో లేదా రిమోట్ కంట్రోల్ లో పనిచేయడానికి దీనిని తయారు చేశారు. ఇది పగటిపూట, రాత్రి పరిస్థితులలోనై పని చేయగల్గుతుంది.