
Air India : గుజరాత్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి లండన్ కు ప్రయాణికులతో బయలుదేరిని విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయినవెంటనే విమానం కూలిపోయింది... ఈ ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియా నుండి లండన్ కు బయలుదేరిన ఈ విమానంలో భారతీయులే కాదు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 242 మంది ప్రయాణికుల్లో అత్యధికంగా 169 మంది ఇండియన్స్ కాగా మిగతావారంతా విదేశీయులే. బ్రిటన్ కు చెందినవారు 53 మంది ఉండగా పోర్చుగీస్ 7, కెనడాకు చెందినవారు 1 ఉన్నారు.
ఇండియన్ ప్యాసింజర్స్ లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఇదే విమానంలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.