42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

By telugu teamFirst Published Feb 15, 2019, 10:54 AM IST
Highlights

ఆదిల్ అహ్మద్ మొహమ్మద్ ను ఆదిల్ అహ్మద్ గాడీ టర్కనేవాలా, వకాస్ కమెండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలుస్తారని సమాచారం. పాకిస్తాన్ నుంచి పనిచేసే జైష్ - ఎ - మొహమ్మద్ లో అతను నిరుడు చేరాడు. 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీరులో 42 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్ సంఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దారంలో నివాసం ఉండేవాడు. గురువారం సిఆర్ప్ఎఫ్ కాన్వాయ్ లోకి పేలుడు పదార్థాలతో కూడిన కారుతో చొచ్చుకుపోయి ఘోరానికి పాల్పడ్డాడు. 

ఆదిల్ అహ్మద్ మొహమ్మద్ ను ఆదిల్ అహ్మద్ గాడీ టర్కనేవాలా, వకాస్ కమెండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలుస్తారని సమాచారం. పాకిస్తాన్ నుంచి పనిచేసే జైష్ - ఎ - మొహమ్మద్ లో అతను నిరుడు చేరాడు. 

ఆదిల్ అహ్మద్ వయస్సు 22 ఏళ్లు. అతను దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ప్రాబల్యం మెండుగా ఉంటుంది. అది అధికారుల రికార్డు ప్రకారమే. 

అతను మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాడు. 2017 మార్చిలో అతను బడి మానేశాడు. ఆ తర్వాత ఏడాదికి, అంటే 2018 అతను ఉగ్రవాద సంస్థలో చేరాడు. 

సంబంధిత వార్తలు

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

click me!