ఆఫ్తాబ్ పూనావాలా నన్ను నరికేస్తానని బెదిరిస్తున్నాడు.. 2020లో పోలీసులకు శ్రద్ధా వాకర్ లేఖ.. తాజాగా వెలుగులోకి

By team teluguFirst Published Nov 23, 2022, 3:07 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్ హత్యలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆమె 2020లో పోలీసులకు రాసిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అందులో అఫ్తాబ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. 

ఢిల్లీలో ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కు సంబంధించిన  లేఖ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె 2020లోనే అఫ్తాబ్ తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు లేఖ రాసింది. సరిగ్గా ఆ లెటర్ రాసి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. 23 నవంబర్ 2020లో ఈ మహారాష్ట్రలోని తులిన్జ్ పోలీసులకు ఆమె లేఖ రాసింది. ఆ సమయంలో ఈ జంట మహారాష్ట్రలోని వాసాయి ఈస్ట్‌లో నివసించేవారు.

మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్లు.. కేరళతో సంబంధాలు వెలుగులోకి.. !

ఆ లేఖలో ఈ విధంగా రాసి ఉంది. ‘‘ ఆఫ్తాబ్ పూనావాలా నన్ను దుర్భాషలాడి కొట్టాడు. ఈ రోజు అతను నన్ను ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను చంపేస్తానని, ముక్కలుగా నరికి విసిరివేస్తానని నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతడు నన్ను కొట్టి ఆరు నెలలు అయ్యింది. కానీ నాకు పోలీసుల వద్దకు వెళ్లే ధైర్యం లేదు. అఫ్తాబ్ నన్ను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అతడి తల్లిదండ్రులకు కూడా తెలుసు. మేము మహారాష్ట్రలోని ఈస్ట్ లో కలిసి జీవిస్తున్నామని కూడా వారికి తెలుసు. వారంతంలో వారు మా దగ్గరికి వచ్చి వెళ్లారు. అతడికి కుటుంబ ఆశీర్వాదం ఉంది. కాబట్టి మేము ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ ఇక నుండి నేను అతనితో జీవించడానికి ఇష్టపడటం లేదు. నన్ను చంపేందుకు, బాధపెట్టేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఎలాంటి శారీరక నష్టం జరిగినా అది అతడి నుంచే వచ్చినట్టు భావించాలి’’ అని శ్రద్ధా వాకర్ తన లేఖలో పేర్కొన్నారు.

బాలికపై గ్యాంప్ రేప్.. తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాధితురాలిపై నిందితుల ఒత్తిడి.. భరించలేక ఆత్మహత్యాయత్నం..

అయితే ఈ ఫిర్యాదుపై విచారణ చేయడానికి పూనావాల ఇంటికి వెళ్లామని పోలీసులు చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. అయితే తరువాత శ్రద్ధా వాకర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని చెప్పారు. దీంతో ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు. కాగా పూనావాలా, అతడి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్టు ఆ వార్తా కథనం పేర్కొంది. 

పండ్లు, ప్రూట్ సలాడ్స్: జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌ భోజనంపై వీడియోలు

ఇదిలా ఉండగా వారు ఎంత కాలం విడిగా జీవించారో స్పష్టంగా తెలియదు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో వారు ఢిల్లీకి వెళ్లారు. అంతకు ముందు సెలవుల్లో హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. కాగా.. హత్యకు సాక్ష్యంగా, పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మెహ్రౌలి అడవిలో దొరికిన కొన్ని శరీర భాగాలు నిజంగా ఆమెవేనని నిర్ధారించడానికి పోలీసులు ముఖ్యంగా ఫోరెన్సిక్ పరీక్ష కోసం చూస్తున్నారు. వీరిద్దరికీ 2019లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇటీవల శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి ఫ్రిజ్ లో ఉంచాడు. శరీర భాగాలు చెడిపోయిన వెంటనే వాటిని బయటకు తీసుకెళ్లి విసిరేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

click me!