ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా.. బల్దియా ఆమ్ ఆద్మీదే!.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే

Published : Dec 05, 2022, 06:31 PM IST
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా.. బల్దియా ఆమ్ ఆద్మీదే!.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే

సారాంశం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు నిలుపుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆజ్ తక్, టైమ్స్ నౌ వెల్లడించిన అంచనాల ప్రకారం, మెజార్టీకి మించి వార్డులను ఆప్ గెలుచుకోగా, బీజేపీ రెండో స్థానంలో నిలిచినట్టు తెలుస్తున్నది.  

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటినట్టు తెలుస్తున్నది. బల్దియాను ఆమ్ ఆద్మీ కైవసం చేసుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఆదివారం 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మెజార్టీ మార్క్ 126గా ఉన్నది. ఢిల్లీ మున్సిప్ కార్పొరేషన్ ఎన్నికలు నిన్న ముగియగా ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి.

250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 149 నుంచి 171 వార్డులను గెలుచుకోబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా, రెండో స్థానంలో బీజేపీ నిలవనున్నట్టు తెలుస్తున్నది. ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ 149 వార్డుల నుంచి 171 వార్డుల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నది. కాగా, బీజేపీ 69 వార్డుల నుంచి 91 వార్డుల వరకు గెలుచుకోబోతున్నది.

టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 146 వార్డుల నుంచి 156 వార్డుల వరకు ఆప్ కైవసం చేసుకోబోతున్నది. కాగా, బీజేపీ 84 వార్డుల నుంచి 94 వార్డుల వరకు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కాంగ్రెస్ పది వార్డులలోపే గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?