బెల్ వెదర్ సీట్స్ లో ఆప్ జోరు, ఉల్టా సీట్స్ లో బీజేపీ... ఢిల్లీ పోరు ఆసక్తికరం

By telugu teamFirst Published Feb 11, 2020, 10:28 AM IST
Highlights

ఢిల్లీ ఎన్నికల వోటింగ్ ముగిసిన రెండు రోజుల తరువాత నేటి ఉదయం కౌంటింగ్ ప్రారంభమయింది. బెల్ వెదర్ సీట్స్ అన్నిటిలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమయింది కాబట్టి ఇంకా ఒక పూర్తి నిర్ణయానికి రాలేము... కాకపోతే ఇప్పటికి మాత్రం ఆప్ దూసుకుపోతుంది. 

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల వోటింగ్ ముగిసిన రెండు రోజుల తరువాత నేటి ఉదయం కౌంటింగ్ ప్రారంభమయింది. బెల్ వెదర్ సీట్స్ అన్నిటిలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమయింది కాబట్టి ఇంకా ఒక పూర్తి నిర్ణయానికి రాలేము... కాకపోతే ఇప్పటికి మాత్రం ఆప్ దూసుకుపోతుంది. 

అంతే కాకుండా ఉల్టా బెల్ వెదర్ సీట్స్ అన్ని కూడా బీజేపీ వైపుగా సాగుతున్నాయి. అసలు ఈ బెల్ వెదర్, ఉల్టా బెల్ వెదర్ సీట్స్ అంటే ఏమిటనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

ఒక నియోజకవర్గంలో గెలిచినా పార్టీయే గనుక అధికారాన్ని కూడా ఈటపాటు చేస్తే దాన్ని మనం బెల్ వెదర్ సీట్ గా పరిగణిస్తాము. కేవలం ఒక్క సారి మాత్రమే కాకుండా గడిచిన మూడు ఎన్నికలను పరిగణలోకి తీసుకొని ఈ లిస్ట్ ను తాయారు చేయడం జరిగింది.  ఉల్టా బెల్ వెదర్ సీట్ అంటే... పూర్తిగా బెల్ వెదర్ సీట్ కి విరుద్ధం. ఆ సీట్లలో గెలిచిన పార్టీ ఇంతవరకు అధికారాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర లేదు. 

Also read; కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్: ఢిల్లీకి ఇప్పటివరకు సీఎంలుగా పనిచేసింది వీరే

విశ్వాస్ నగర్, ముస్తఫాబాద్ సీట్లను మనం ఉల్టా బెల్ వెదర్ సీట్స్ గా గుర్తిస్తాము. విశ్వాస్ నగర్ లో ఓం ప్రకాష్ శర్మ మెజార్టీలో కొనసాగుతున్నారు. 2015లో కూడా ఓం ప్రకాష్ శర్మ ఇక్కడి న్నుండి గెలిచారు. ఆ స్థానంలో బీజేపీ గెలిస్తే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసింది. 

ముస్తఫాబాద్ లో కూడా గతంలో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ అక్కడనుంచి గెలిచారు. ఈ సారి కూడా ఆయన అక్కడ లీడింగ్ లో కొనసాగుతున్నారు. 

ఇక బెల్ వెదర్ సీట్స్ విషయానికిన్ వస్తే... 10 బెల్ వెదర్ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 9 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుంది. సదర్ బజార్, పటేల్ నగర్, కొండ్లి, పట్ పట్ గంజ్, సీమపురి, న్యూఢిల్లీ, మాదిపూర్, మాలవ్య నగర్, తిమార్పుర్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ లో ఉంది. 

ఒకే ఒక్క సీట్ మోడల్ టౌన్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడ్డట్టు కనబడుతుంది. అక్కడ ఆకాంక్ష ఉల్లా రూపంలో కాంగ్రెస్ నుంచి ఒక బలమైన అభ్యర్థి ఉండడంతో అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ల మధ్య ఓట్లు చీలి బీజేపీకి లాభం, చేకూర్చేవిధంగా కనబడుతుంది. 

ప్రస్తుతానికి ఇప్పుడు చాలా ఎర్లీ గా కేవలం ఒక్క రౌండ్ ఈవీఎం కౌంటింగ్ మాత్రమే ప్రారంభమైంది కాబట్టి ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టమే అయినప్పటికీ ఆ నియోజకవర్గాల జనాభా ప్రాతిపదికన అక్కడ దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేలా కనబడుతుంది. 

click me!