హోటల్ గదిలో బంధించి అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు

Published : Feb 11, 2020, 10:01 AM IST
హోటల్ గదిలో బంధించి అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు

సారాంశం

భర్తను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న తనకు ఎమ్మెల్యే మేనల్లుడు 2014లో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు.  

మరో బీజేపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పటికే పలవురు బీజేపీ నేతలు పలు కేసుల్లో ఇరుక్కోగా తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి,మరో ఆరుగురు కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Also Read ఉన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత మృతి: వార్ధాలో ఉద్రిక్తత...

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని బదోహి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠిపై సంచలన ఆరపణలు చేశారు.  భర్తను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న తనకు ఎమ్మెల్యే మేనల్లుడు 2014లో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు.

ఆ తర్వాత 2017  యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మేనలుడు తనను బదోహిలోని ఓ హోటల్ కి తీసుకువెళ్లాడని ఆమె చెప్పింది. అక్కడ తనను నిర్భందించాడని వాపోయింది. ఆ హోటల్ కి ఎమ్మెల్యే మరో ఆరుగురు వారి కుటుంబసభ్యులు అక్కడకు వచ్చారని.. వారంతా కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?