ఓ యువకుడిని పాము కాటేసింది. దీంతో ఆ యువకుడు పామును కూడా తన వెంట హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆ పామును చూసి తనకు వైద్యం అందించాలని కోరారు. పామును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు.
పాము కరిస్తే ఏం చేస్తారు ? సాధారణంగా అయితే అందరూ వెంటనే అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు వెళ్తారు. తమను పాము కాటేసిందని వైద్యం అందించాలని అభ్యర్థిస్తారు. అక్కడున్న డాక్టర్లు చికిత్స అందిస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని పాము కాటేసింది. దీంతో అతడు పామును కూడా తీసుకొని హాస్పిటల్ కు వచ్చాడు. అసలేం జరిగిందంటే..
అది ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపుర్ జిల్లా. లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామం. అక్కడి ఓ ఇంట్లో సూరజ్ అనే యువకుడు జీవిస్తున్నాడు. అయితే సూరజ్ సోమవారం తన ఇంటి దగ్గర ఉన్న సమయంలో అతడిని పాము కాటేసింది. ఈ పరిణామానికి ఆ యువకుడు భయపడలేదు. వెంటనే ఆ పామును తీసుకొని ఓ సంచిలో వేశాడు.
మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికులందరూ చూస్తుండగానే దారుణం..
ఇంటి దగ్గర ఉన్న బైక్ పై పాముతో పాటుగా మీర్జాపూర్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడున్న డాక్టర్లు ఆ యువకుడిని చూశారు. చేతిలో సంచి కనిపించింది. వారికి ఏం అర్థం కాలేదు. వెంటనే ఆ సంచిలోని పామును తీసి బెడ్ పై పెట్టాడు. అక్కడున్న డాక్టర్లందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు.
deepfake : గర్భా అడిన ప్రధాని వీడియో డీప్ ఫేక్ కాదు.. వైరలైన క్లిప్ లో ఉన్నది ఎవరో తెలుసా ?
పామును ఎందుకు హాస్పిటల్ కు తీసుకొచ్చావని డాక్టర్లు అడిగారు. దీంతో సూరజ్ మెళ్లగా అసలు విషయం చెప్పాడు. తనను ఈ పాము కాటేసిందని, అది ఏ రకానికి చెందిందో గుర్తించి, దానికి సంబంధించిన చికిత్స అందించాలని కోరారు. అప్పటిగాను డాక్టర్లకు అసలు సంగతేంటో అర్థం కాలేదు. కొంత సమయం తరువాత సూరజ్ పామును సంచిలో మళ్లీ బంధించాడు. అనంతరం డాక్టర్లు అతడికి చికిత్స అందించారు.