
ఉత్తరాఖండ్ కు చెందిన ఓ యువకుడు స్కూటీ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. దాని కోసం డబ్బులను కూడా సమకూర్చుకున్నాడు. అయితే అందరిలా తాను కూడా మామూలుగా డబ్బులు చెల్లించి స్కూటే కొంటే ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో కానీ కొంచెం క్రేజీగా ఆలోచించాడు. స్కూటీకి చెల్లించాల్సిన మొత్తం డబ్బులో నుంచి రూ.50 వేలను పది రూపాయిల కాయిన్ల రూపంలో అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్‌లో దీపావళి రోజే అల్లర్లు.. పక్కా ప్రణాళికతోనే దాడులు: రాష్ట్ర పోలీసులు
ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్‌లోని టీవీఎస్ షో రూం అది. ఓ యువకుడు లోపలికి వచ్చాడు. తనకు టీవీఎస్ జూపిటర్ స్కూటీ కావాలని అన్నారు. దానిదేముంది తప్పుకుండా అమ్ముతాం అని సిబ్బంది బదులిచ్చారు. ఆ స్కూటీ ధర, దానిలో ఉండే ప్రత్యేకతలు అన్నీ వివరించారు. అన్నీ ఆ యువకుడికి నచ్చాయి. సరే తాను తప్పకుండా స్కూటీ కొనుగోలు చేస్తానని చెప్పాడు. దీనికి షో రూం సిబ్బంది ఎంతో సంతోషించారు.
కానీ కొంత సమయం తరువాత వారి సంతోషం ఆవిరి అయిపోయే ఒక విషయం చెప్పాడు ఆ యువకుడు. తన వద్ద రూ.10 కాయిన్లు మాత్రమే ఉన్నాయని వాటి విలువ రూ.50 వేలు ఉంటుందని, వాటితోనే తాను స్కూటీ కొంటానని తెలిపాడు. అతడి మాటలు విన్న సిబ్బంది షాక్ అయ్యారు. కొన్ని చర్చల తరువాత వారు కాయిన్లను స్వీకరించేందుకు ఒప్పుకున్నారు.
బాలుడిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు..నీళ్ళు అడిగితే నోట్లో కారం కొట్టి పైశాచికత్వం...
సంచుల్లో తీసుకొచ్చిన ఆ కాయిన్లను సిబ్బంది అంతా కూర్చొని లెక్క పెట్టడం ప్రారంభించారు. ముందుగా వాటిని ఓ డెస్క్ పై కుప్పగా పోసి పది కాయిన్ల చొప్పున ఒక్క దగ్గర పెట్టి లెక్కించడం మొదలు పెట్టారు. రూ.50 వేల కాయిన్లు లెక్కించాలంటే సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇలా వారు కాయిన్లు లెక్కపెడుతూ ఉంటే స్కూటీ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి వీడియో కూడా తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియో తీస్తున్న సమయంలో ఆ యువకుడు తాను రూ.50 వేల విలువైన పది రూపాయిల కాయిన్లు తెచ్చానని చెప్పడం వినిపిస్తోంది. షో రూం సిబ్బంది ఇబ్బంది పడుతూ కాయిన్లను లెక్క పెట్టడం కూడా కనిపిస్తోంది. కాగా.. ఆ టీవీఎస్ జూపిటర్ ధర రుద్రాపూర్ ఆన్ రోడ్ పై రూ. 85,210గా ఉంది. రూ.50 వేలను కాయిన్ల రూపంలో చెల్లించగా.. మిగిలిన డబ్బును ఎలా చెల్లించారో స్పష్టంగా తెలియరాలేదు.
స్తంభించిన వాట్సాప్ సేవలు.. నిలిచిపోయిన మెస్సేజీలు, మీడియా ఫైల్స్.. ఎప్పుడు రీస్టోర్ అవుతుందంటే?
ఇదిలా ఉండగా.. కాయిన్లను చెల్లించి వాహనాలను కొనుగోలు చేయడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది మార్చి నెలలో తమిళనాడు కు చెందిన ఓ వ్యక్తి బజాజ్ డామినార్ 400కి కొనుగోలు చేసేందుకు అవసరమైన రూ. 2.6 లక్షలను ఒక్క రూపాయి కాయిన్ల రూపంలో చెల్లించాడు. దీని కోసం ఆ వ్యక్తి మూడేళ్లకు పైగా కాయిన్లను సేకరించాడు. షోరూం సిబ్బందికి నాణేలను లెక్కించేందుకు 10 గంటల సమయం పట్టింది. ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి కూడా గతంలో ఇలాగే లక్షల్లో కాయిన్లను చెల్లించి ఓ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ మీరెప్పుడైనా ఇలా కాయిన్ల ద్వారా వాహనాన్ని కొన్నారా ?