బాలుడిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు..నీళ్ళు అడిగితే నోట్లో కారం కొట్టి పైశాచికత్వం...

Published : Oct 25, 2022, 02:15 PM IST
బాలుడిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు..నీళ్ళు అడిగితే నోట్లో కారం కొట్టి పైశాచికత్వం...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిపై దొంగతనం నేరం మోపి పైశాచికంగా ప్రవర్తించారు. స్తంభానికి కట్టేసి మూడు గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు. 

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ బాలుడిని స్తంభానికి కట్టేశారు. మూడుగంటలపాటు తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక బాలుడు నీళ్లు అడిగితే ఇవ్వకుండా నోట్లో కారం కొట్టారు. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చెవి, ముక్కు నుంచి రక్తస్రావమయ్యింది. సమాచారం అందుకున్న అజంగఢ్ సిటీ ఎస్పీ శైలేంద్ర లాల్ మాట్లాడుతూ..నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఈ ఘటనపై ఎస్పీ అనురాగ్ ఆర్య ఇన్ ఛార్జి ఇన్ స్పెక్టర్ ను మందలించారు. 

కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అజంగఢ్ జిల్లాలోని బర్దా ప్రాంతంలోని హడిసా గ్రామంలో..దొంగతనం నెపంతో ఓ అమాయక చిన్నారిని స్తంభానికి కట్టేశారు. అతను సెల్ ఫోన్ ను దొంగిలించినట్లు గ్రామస్థులు అనుమానించారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి రాంకేశ్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో 4 రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ అసరే రామ్, సంజయ్ రామ్, సురేంద్ర రామ్, విజయ్ రామ్ తన కొడుకు మొబైల్ దొంగిలించాడని ఆరోపించారు. 

ఫోన్ దొంగతనం చేశాడని.. పన్నెండేళ్ల చిన్నారిపై పైశాచితక్వం.. బావిలో వేలాడదీసి క్రూరత్వం...

చిన్నారికి చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు..మూడుగంటలపాటు తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో బాధితుడు నీళ్లు అడిగితే ఇవ్వకుండా నోటిలో కారం పెట్టారు. అయితే,అక్కడ నిలబడి ఉన్నజనం మాత్రం ఘటనను ఆపకుండా చూస్తూ ఉండిపోవడం గమనార్హం. ఈ విషయమైనగర ఎస్పీ శైలేంద్రలాల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా పోలీసులకు విషయం తెలిసిందన్నారు. దీని మీద తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాలుడిని కొడుతున్న సమయంలో ఆపకుండా నిలబడి ఉన్న గ్రామస్తులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu