జీతం అడిగాడని దళిత యువకుడిని చెప్పు నాకించిన మహిళా వ్యాపారవేత్త.. క్షమాపణలు చెప్పాలనీ ఒత్తిడి..

By Asianet NewsFirst Published Nov 25, 2023, 3:03 PM IST
Highlights

జీతం అడిగినందుకు ఓ మహిళా వ్యాపారవేత్త దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేసింది. చెప్పు నాకించి, క్షమాపణలు కోరాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.

గుజరాత్ లో ఓ మహిళా వ్యాపారవేత్త అమానవీయంగా ప్రవర్తించారు. జీతం అడిగినందుకు ఓ దళిత యువకుడి పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఆ యువకుడిని చెప్పు నాకించి, క్షమాపణలు కూడా అడగాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మోర్బి నగరంలో జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో ఆ మహిళా వ్యాపారవేత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బర్త్ డే రోజు దుబాయ్ తీసుకెళ్లలేదని దారుణం.. భర్తను ముక్కుపై గుద్ది చంపిన భార్య..

Latest Videos

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో అక్టోబర్ ప్రారంభంలో నెలకు రూ .12,000 జీతానికి నీలేష్ దాల్సానియా అనే యువకుడు ఉద్యోగంలో చేరారు. అయితే ఆయన కాంట్రాక్టర్ అక్టోబర్ 18న రద్దయింది. దీంతో యవకుడు తాను చేసిన 16 రోజుల పనికి జీతం ఇవ్వాలని ఆ కంపెనీ యజమానురాలు విభూతి పటేల్ ను కోరారు. 

తాను కంపెనీలో 16 రోజుల పాటు పని చేశానని, దానికి జీతం ఇవ్వాలని యువకుడు ఆమెను కోరారు. దీనికి విభూతి పటేల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అతడు బుధవారం తన సోదరుడు, పక్కింటి వ్యక్తిని తీసుకొని విభూతి పటేల్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ మహిళా వ్యాపారవేత్త సోదరుడు ఓం పటేల్, అతని అనుచరులు వారిపై దాడి చేశారు.

భళా కంబళ.. తొలిసారిగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో నిర్వహణ.. ఏమిటీ పోటీలు.. ? (ఫొటోలు)

విభూతి పటేల్ కూడా అతన్ని చెంపదెబ్బ కొట్టింది. అనంతరం బాధితుడిని కమర్షియల్ బిల్డింగ్ మేడపైకి ఈడ్చుకెళ్లారు. అక్కడ పలువురు వ్యక్తులు యువకుడిని బెల్టుతో కొట్టి, తన్నారు. ఈ క్రమంలో విభూతి పటేల్ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదరక్షలను నాకించి, క్షమాణలు కోరాలని ఒత్తిడి తీసుకొచ్చింది. మళ్లీ స్థానికంగా కనిపిస్తే చంపేస్తానని బెదిరించింది.

ప్రపంచంలోని హిందువులంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అతడిని మోర్బి సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై దాడి, క్రిమినల్ బెదిరింపులు, అల్లర్లు, సంబంధిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!